అత్తాకోడళ్లపై వాట్సాప్ లో జోకులు | WhatsApp Jokes About How Notes Ban Has Affected Aishwarya And Jaya Bachchan | Sakshi
Sakshi News home page

అత్తాకోడళ్లపై వాట్సాప్ లో జోకులు

Published Tue, Jan 3 2017 3:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

అత్తాకోడళ్లపై వాట్సాప్ లో జోకులు

అత్తాకోడళ్లపై వాట్సాప్ లో జోకులు

ముంబై: నరేంద్ర మోదీ సర్కారు పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలకు నోట్ల రద్దు సెగ తాకిందని సోషల్‌ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం కూడా నోట్ల కష్టాలు పడుతోందని వాట్సాప్ లో జోకులు షేర్ చేస్తున్నారు.

ఒకే చీరను అమితాబ్‌ భార్య జయబచ్చన్‌, కోడలు ఐశ్వర్యరాయ్‌ రాయ్‌ బచ్చన్‌ వివిధ సందర్భాల్లో కట్టుకున్న ఫొటోలు అత్తాకోడళ్లకు నోట్ల కష్టాలు అంటూ కామెంట్లు పెట్టారు. ఒకే డిజైన్‌ తో ఉన్న ఎరుపు రంగు చీరను అత్తాకోడళ్లను పలు సందర్భాల్లో ధరించారు. గత సెప్టెంబర్ లోనే ఈ ఫోటోలు ఆన్‌ లైన్‌ లో హల్‌ చల్‌ చేశాయి. నోట్ల కష్టాల నేపథ్యంలో నెటిజన్లు మరోసారి వీటిని వెలుగులోకి తెచ్చి తమ హాస్యచతురత ప్రదర్శించారు. అయితే ఈ ప్రచారంపై బచ్చన్‌ కుటుంబం స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement