ఓఎల్‌ఎక్స్‌ ప్రీ–ఓన్డ్‌ కార్‌ స్టోర్లు | OLX Enter in Pre Owned Car Business With Berlin Company | Sakshi
Sakshi News home page

ఓఎల్‌ఎక్స్‌ ప్రీ–ఓన్డ్‌ కార్‌ స్టోర్లు

Published Fri, Nov 30 2018 8:53 AM | Last Updated on Fri, Nov 30 2018 8:53 AM

OLX Enter in Pre Owned Car Business With Berlin Company - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ కంపెనీ ఓఎల్‌ఎక్స్‌... ప్రీఓన్డ్‌ కార్ల అమ్మకాల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం బెర్లిన్‌కు చెందిన యూజ్డ్‌ కార్‌ గ్రూప్‌ ఫ్రాంటియర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు పలు నగరాల్లో ‘ఓఎల్‌ఎక్స్‌ క్యాష్‌ మై కార్‌’ పేరిట స్టోర్లను ఏర్పాటు చేస్తోంది.

దీంతో ఓఎల్‌ఎక్స్‌ యూజర్లు ఆన్‌లైన్‌తో పాటూ ఆయా స్టోర్లలో ప్రీ ఓన్డ్‌ కార్లను విక్రయించే వీలుంటుంది. ప్రస్తుతం దేశంలోని 10 నగరాల్లో 27 స్టోర్లున్నాయని.. 2021 నాటికి 40 నగరాల్లో 150 స్టోర్లను ప్రారంభిస్తామని ఓఎల్‌ఎక్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement