మనిషిని చంపిన రోబో! | Robot kills man at Volkswagen plant in Germany | Sakshi
Sakshi News home page

మనిషిని చంపిన రోబో!

Published Fri, Jul 3 2015 2:15 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

మనిషిని చంపిన రోబో! - Sakshi

మనిషిని చంపిన రోబో!

బెర్లిన్: రోబోలు మనుషులను చంపడం ఇప్పటిదాకా సినిమాల్లోనే చూశాం. కానీ జర్మనీలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన కార్ల తయారీ ఫ్యాక్టరీలో ఓ రోబో నిజంగానే మనిషిని చంపేసింది! కార్మికుడిని దగ్గరికి లాక్కుని, ఓ లోహపు పలకపై వేసి ఛాతీపై నొక్కుతూ నలిపేసింది! ఫ్రాంక్‌ఫర్ట్‌కు 100 కి.మీ. దూరంలోని బౌనతల్ వద్ద గల ఫోక్స్‌వ్యాగన్ ఫ్యాక్టరీలో మంగళవారం రోబోను కార్మికులు సిద్ధం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడిన 21 ఏళ్ల కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

అయితే, ఇది సినిమాల్లో చూసినట్టు మనిషి రూపంలో ఉండే హ్యూమనాయిడ్ రోబో కాదు. జేసీబీలా ఉండే రోబోటిక్ యంత్రం. సాధారణంగా యంత్రాలను జోడించే చోటు(అసెంబ్లీ లైన్) వద్ద ఈ రోబోలు మనుషులకు పక్కపక్కనే ఉంటూ పనిచేస్తాయని, తర్వాత సేఫ్టీ బోన్లలోకి వెళతాయని స్థానిక మీడియా పేర్కొంది.

అయితే, ప్రమాదానికి కారణమైన రోబో కొత్తతరం రోబో కాదని, దానిని ఇన్‌స్టాల్ చేసేందుకని ఓ కార్మికుడు సేఫ్టీ బోను లోపలికి వెళ్లడంతో అతడిని చంపేసినట్లు తెలిపింది. దీనిపై ఫోక్స్‌వ్యాగన్ వర్గాలు స్పందిస్తూ.. ఇందులో రోబో వైఫల్యం లేదని, మానవ తప్పిదం వల్లే ఇలా జరిగిందని తెలిపాయి. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement