
రోబో ను అరెస్టు చేసిన పోలీసులు..!!
మాస్కో: రజినీకాంత్ సినిమా 'రోబో' లో చిట్టి పేరుతో ఉండే రోబో పెద్ద అరాచకాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. శాస్త్రవేత్త పాత్రలో ఉన్న హీరో అతి కష్టం మీద రోబోను కట్టడి చేస్తాడు. నిజజీవితంలో కూడా అలాంటి రోబోలుంటాయా అనంటే అంతకాకున్నా రష్యాలోని ఓ ల్యాబ్ నుంచి రెండు సార్లు ప్రయోగశాల నుంచి తప్పించుకుంది. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం.
రోడ్లపై తిరుగుతూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఒక రాజకీయ సభ జరుగుతుంటే అక్కడికి వెళ్లింది. అక్కడ తమ అభిప్రాయాలను రోబో రికార్డు చేస్తోందని అక్కడి వారు పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ రోబోను అరెస్టు చేశారు. ఎదుటివారి మాటలను విని గుర్తుంచుకోవడం ఈ రోబో ప్రత్యేకత. వినియోగదారుల సేవల కోసం ఈ రోబోను రష్యన్ శాస్త్రవేత్తలు రూపొందించారు.