
అసలు నిందితుడు అతడు కాదు!
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ట్రక్కుతో విధ్వంసం సృష్టించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేశామని అక్కడి భద్రతా బలగాలు తెలిపాయి. దుండగుడు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తి అని అధికారులు వెల్లడించారు. అయితే.. తాము పొరపాటున వేరే వ్యక్తిని అరెస్ట్ చేశామని.. ట్రక్కు దాడికి పాల్పడింది అతడు కాదని బెర్లిన్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అసలు నిందితుడు వేరే ఉన్నాడని.. అతడి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయని తెలిపారు.
ఇంకా పట్టుబడని దుండగుడి వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్నాయని.. విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో అక్కడ తీవ్ర కలకలం రేగుతోంది. సోమవారం ట్రక్కు దాడిలో.. సెంట్రల్ బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజలను లక్ష్యంగా దుండగుడు ట్రక్కుతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా జనంపైకి ట్రక్కును తోలుతూ.. మారణహోమానికి దిగాడు. ఈ ఘటనలో 12 మంది చెందగా, 50 మంది గాయపడ్డారు.