ప్రధాని కోసం వెళ్లిన మరో విమానం | Air India One develops problem, standby sent to ferry | Sakshi
Sakshi News home page

ప్రధాని కోసం వెళ్లిన మరో విమానం

Published Tue, Apr 14 2015 11:07 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లిన ఎయిర్ ఇండియా వన్ విమానం - Sakshi

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లిన ఎయిర్ ఇండియా వన్ విమానం

న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీని తీసుకువెళ్లిన 'ఎయిర్ ఇండియా వన్' బోయింగ్ 747-400 విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మోదీ ఆ విమానంలో న్యూఢిల్లీ నుంచి బయలుదేరి పారిస్, తౌలౌజ్, హనోవర్‌లలో ఆగి, అనంతరం బెర్లిన్‌కు వెళ్లారు. ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైలో సిద్ధంగా ఉన్న మరో 'ఎయిర్ ఇండియా వన్' మంగళవారం తెల్లవారు జామున బెర్లిన్ బయల్దేరి వెళ్లింది.

మోదీ తన మిగతా పర్యటనను ఇందులోనే ముగించి, భారత్‌కు తిరిగివస్తారు. ఈ నెల 9న పారిస్ వెళ్లిన ప్రధాని మోదీ 18 ఉదయం తిరిగి ఇక్కడికి వాస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement