ఎఫ్1 బాస్‌కు ‘బేబీ’ కష్టాలు... | Formula One boss Bernie Ecclestone says wife Fabiana wants a baby | Sakshi
Sakshi News home page

ఎఫ్1 బాస్‌కు ‘బేబీ’ కష్టాలు...

Published Sun, Mar 9 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

ఎఫ్1 బాస్‌కు ‘బేబీ’ కష్టాలు...

ఎఫ్1 బాస్‌కు ‘బేబీ’ కష్టాలు...

 బెర్లిన్: ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలి... లేకుంటే సమస్యలొచ్చిపడతాయి. ఫార్ములా వన్ బాస్ బెర్నీ ఎకిల్‌స్టోన్ (83)కు ఇప్పుడు అదే కష్టమొచ్చిపడింది. ఆయన భార్య ఫాబియానా (37) పిల్లల్ని కనాలని అనుకుంటోంది. ఇదే మాటను ఎకిల్‌స్టోన్‌కు చెప్పిందట. ఆయనేమో ఈ వయసులో పిల్లల్ని కనడం బాగోదేమో అంటున్నారు. ‘నా భార్య ఫాబియానా ఇప్పుడు పిల్లల్ని కనాలనుకుంటోంది.  
 
 ఇప్పుడు నాకు 83 ఏళ్లు. ఈ వయస్సులో బాగుండదేమో..!’ అని చెప్పారు. అలాగని పిల్లలపై ఆసక్తి చూపడం లేదనుకుంటే పొరపాటే.. ‘నా భార్య కోరిక సాధ్యమవుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే ఆరేళ్ల వయసులో స్కూల్‌కు వెళ్లిన నా బిడ్డను నేనే (అప్పటికి నా వయసు 90 ఏళ్లు) తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి’ అని ఆయనే అంటున్నారు. ఈ ఎఫ్1 బాస్‌కు ఫాబియానా మూడో భార్య. 2012లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. గతంలో ఇద్దరు భార్యలతో ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement