89 ఏళ్ల వయస్సులో... | Former Formula One boss Bernie Ecclestone set to become a Father | Sakshi
Sakshi News home page

89 ఏళ్ల వయస్సులో...

Published Sun, Apr 5 2020 5:22 AM | Last Updated on Sun, Apr 5 2020 5:24 AM

Former Formula One boss Bernie Ecclestone set to become a Father - Sakshi

లండన్‌: కోవిడ్‌–19 మహమ్మారి వల్ల గత కొన్నిరోజులుగా అన్ని దుర్వార్తలే వింటున్న నేపథ్యంలో ‘ఫార్ములావన్‌’ మాజీ చీఫ్‌ ఎకిల్‌స్టోన్‌ నుంచి ఓ శుభవార్త వచ్చింది. 1978 నుంచి 2017 వరకు ఫార్ములావన్‌కు సీఈఓగా ఉన్న ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. మామూలుగా అయితే ఎవరైనా తండ్రి కావడం సాధారణ విషయమే. కానీ ఎకిల్‌స్టోన్‌కు ఇప్పుడు 89 ఏళ్లు! అదే ఈ వార్తకున్న విశేషం! ఆయనకు లేటు వయసులోనూ నాన్నయ్యే ‘ఫార్ములా’ పంట పండింది. ఎకిల్‌స్టోన్‌ మూడో భార్య 44 ఏళ్ల ఫాబియానా ఫ్లోసి ఈ జూలైలో తన వృద్ధండ పెనిమిటికి వారసుణ్ని బహుమతిగా ఇవ్వనుంది.

వైద్య పరీక్షల్లో ఆమెకు కలిగే సంతానం మగ శిశువని తేలింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తన భార్య తెగ సంబరపడుతున్నట్లు ఎకిల్‌స్టోన్‌ తెలిపారు. తమ ఇద్దరి మధ్య వయసురీత్యా చాలా వ్యత్యాసం ఉండటంతో ఈ వార్తను ఊహించలేదన్నారు. ఎకిల్‌స్టోన్‌కు తన మాజీ ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇక తాజా వైరస్‌ మరణమృదంగంపై ఆయన స్పందిస్తూ ‘మొ దట్లో ఏంటీ నాన్‌సెన్స్‌ అనుకున్నా. ఫ్లూ గురించి ఎప్పుడూ వినేదే! యేటా ఓ సీజన్‌లా వచ్చిపోయేదే అని భావించా... కానీ ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది’ అని కరోనాపై వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement