సీపీఎంలో అసంతృప్తి సెగలు | discontent in CPM | Sakshi
Sakshi News home page

సీపీఎంలో అసంతృప్తి సెగలు

Published Sat, Dec 31 2016 10:27 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

సీపీఎంలో అసంతృప్తి సెగలు - Sakshi

సీపీఎంలో అసంతృప్తి సెగలు

మహేశ్వరి గార్డెన్‌లో అర్బన్‌ జిల్లా పార్టీ సభ్యుల భేటీ
స్థానికత, సామర్థ్యానికి తిలోదకాలిచ్చారని విమర్శ
అర్బన్‌ జిల్లాకు ప్రాధాన్యం లేదని నిరసన
రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం
నామినేటెడ్‌ కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌


వరంగల్‌ : క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరునున్న సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కిస్టు))లో జిల్లాల పునర్విభజన ముసలం పుట్టించింది. కొత్త జిల్లాలకు ఇటీవల నియమించిన కమిటీలపై పార్టీ సభ్యులు, కార్యకర్తలు నిరసన గళం విప్పారు. వరంగల్‌లోని మహేశ్వరీ గార్డెన్‌లో సమావేశమై కొత్త కమిటీల నియామకాన్ని, పార్టీలోని పరిస్థితులను తీవ్రంగా తప్పుబట్టారు. స్థానికేతరులకు, ఉద్యమ చరిత్రలేని వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారని కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రత్యేక సమావేశం అనంతరం పార్టీ సభ్యులు స్వయంగా పత్రిక ప్రకటన జారీ చేశారు. పార్టీలోని ప్రస్తుత పోకడలను విమర్శిస్తూ లేఖలో పేర్కొన్నారు. ‘వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రజలతో సంస్థలో జమ చేయకుండా నొక్కేశారని తెలుస్తోంది. వరంగల్‌ రీజియన్‌ పరిధి, ఆర్టీసీ వరంగల్‌ రూరల్‌ డివిజన్‌లోని తొర్రూరు డిపోలో సంవత్సరకాలంగా అద్దెను జమచేయకుండా నొక్కేశారని సమాచారం. తొర్రూరు డిపోలో 31 స్టాల్స్‌ను అద్దెకు ఇచ్చారు.

ఈ స్టాల్స్‌ కేటాయించే ముందు నిబంధనల మేరకు ఆరు నెలల అద్దెను అడ్వాన్స్‌గా డిపాజిట్‌ చేయించుకుంటారు. ఏదేని పరిస్థితుల్లో స్టాల్స్‌ నిర్వాహకులు సంవత్సర కాలంగా అద్దె చెల్లించనట్లు రికార్డుల్లో చూపుతున్నా డిపో అధికారులు, బాధ్యలైన ఉద్యోగులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రధాన ప్రశ్న. అయినా స్టాల్స్‌ నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో అద్దెను వసూలు చేసే బా«ధ్యులైన ఉద్యోగులే ఈ సొమ్ము కాజేశారని అనుమానాలు కలుగుతున్నాయి. అద్దె సొమ్మును కాజేసిన అధికారులు, ఉద్యోగులు స్టాల్స్‌ నిర్వాహకులను మచ్చిక చేసుకుని ఉన్నతాధికారులకు తప్పుడు సాక్ష్యం ఇప్పించేందుకు యత్నిస్తున్నారని సమాచారం. తమపై వేటు పడకుండా ఉండేందుకు అధికారులు, ఉద్యోగులు చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ఆ తప్పులను స్టాల్స్‌ నిర్వాహకులపై నెట్టివేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. తొర్రూరు డిపో స్టాల్స్‌కు సంబందించిన అద్దె రూ.దాదాపు 4 లక్షలు సంస్థ ఖాతాలో జమ కాకపోవడంపై ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణ సందర్భంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చి తమ ఉద్యోగాలను కాపాడుకునే ప్రయత్నాలను బాధ్యులైన ఉద్యోగులు ముమ్మరం చేశారు. ఈ అక్రమాల్లో దాదాపుగా ఆరు నుంచి ఏడుగురు ఉద్యోగులపై వేటు పడనుంది. రీజియన్‌ అధికారుల సొమ్ము కాజేతను సీరియస్‌గా తీసుకున్నారు. అయితే అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు.. స్టాల్స్‌ నిర్వాహకులచే తామే అద్దె చెల్లించలేదని చెప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సొమ్ము కాజేసిన ఉద్యోగుల్లో కొందరు సెలవులు తీసుకుని విచారణకు ఆటంకాలు కలిగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకెళ్లి సెలవులు పెడుతున్నారని ఆర్టీసీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.

ఈ మెడికల్‌ సర్టిఫికెట్లు ఇప్పించడంలో కొంత మంది యూనియన్‌ నాయకులు సహకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆరు నెలలు అద్దె చెల్లించకపోతే డిపాజిట్‌గా ఉన్న సొమ్ము అద్దెగా జమ చేసుకుని స్టాల్స్‌ మూసి వేయాలి. అయితే ఇక్కడ మాత్రం సంవత్సర కాలంగా అద్దె చెల్లించకున్నా ఎలాంటి చర్యటూ తీసుకోలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement