The reorganization of districts
-
సీపీఎంలో అసంతృప్తి సెగలు
మహేశ్వరి గార్డెన్లో అర్బన్ జిల్లా పార్టీ సభ్యుల భేటీ స్థానికత, సామర్థ్యానికి తిలోదకాలిచ్చారని విమర్శ అర్బన్ జిల్లాకు ప్రాధాన్యం లేదని నిరసన రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం నామినేటెడ్ కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ వరంగల్ : క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరునున్న సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు))లో జిల్లాల పునర్విభజన ముసలం పుట్టించింది. కొత్త జిల్లాలకు ఇటీవల నియమించిన కమిటీలపై పార్టీ సభ్యులు, కార్యకర్తలు నిరసన గళం విప్పారు. వరంగల్‌లోని మహేశ్వరీ గార్డెన్లో సమావేశమై కొత్త కమిటీల నియామకాన్ని, పార్టీలోని పరిస్థితులను తీవ్రంగా తప్పుబట్టారు. స్థానికేతరులకు, ఉద్యమ చరిత్రలేని వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారని కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రత్యేక సమావేశం అనంతరం పార్టీ సభ్యులు స్వయంగా పత్రిక ప్రకటన జారీ చేశారు. పార్టీలోని ప్రస్తుత పోకడలను విమర్శిస్తూ లేఖలో పేర్కొన్నారు. ‘వరంగల్ అర్బన్ జిల్లా ప్రజలతో సంస్థలో జమ చేయకుండా నొక్కేశారని తెలుస్తోంది. వరంగల్ రీజియన్ పరిధి, ఆర్టీసీ వరంగల్ రూరల్ డివిజన్లోని తొర్రూరు డిపోలో సంవత్సరకాలంగా అద్దెను జమచేయకుండా నొక్కేశారని సమాచారం. తొర్రూరు డిపోలో 31 స్టాల్స్‌ను అద్దెకు ఇచ్చారు. ఈ స్టాల్స్ కేటాయించే ముందు నిబంధనల మేరకు ఆరు నెలల అద్దెను అడ్వాన్స్‌గా డిపాజిట్ చేయించుకుంటారు. ఏదేని పరిస్థితుల్లో స్టాల్స్ నిర్వాహకులు సంవత్సర కాలంగా అద్దె చెల్లించనట్లు రికార్డుల్లో చూపుతున్నా డిపో అధికారులు, బాధ్యలైన ఉద్యోగులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రధాన ప్రశ్న. అయినా స్టాల్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో అద్దెను వసూలు చేసే బా«ధ్యులైన ఉద్యోగులే ఈ సొమ్ము కాజేశారని అనుమానాలు కలుగుతున్నాయి. అద్దె సొమ్మును కాజేసిన అధికారులు, ఉద్యోగులు స్టాల్స్ నిర్వాహకులను మచ్చిక చేసుకుని ఉన్నతాధికారులకు తప్పుడు సాక్ష్యం ఇప్పించేందుకు యత్నిస్తున్నారని సమాచారం. తమపై వేటు పడకుండా ఉండేందుకు అధికారులు, ఉద్యోగులు చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ఆ తప్పులను స్టాల్స్ నిర్వాహకులపై నెట్టివేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. తొర్రూరు డిపో స్టాల్స్‌కు సంబందించిన అద్దె రూ.దాదాపు 4 లక్షలు సంస్థ ఖాతాలో జమ కాకపోవడంపై ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణ సందర్భంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చి తమ ఉద్యోగాలను కాపాడుకునే ప్రయత్నాలను బాధ్యులైన ఉద్యోగులు ముమ్మరం చేశారు. ఈ అక్రమాల్లో దాదాపుగా ఆరు నుంచి ఏడుగురు ఉద్యోగులపై వేటు పడనుంది. రీజియన్ అధికారుల సొమ్ము కాజేతను సీరియస్‌గా తీసుకున్నారు. అయితే అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు.. స్టాల్స్ నిర్వాహకులచే తామే అద్దె చెల్లించలేదని చెప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సొమ్ము కాజేసిన ఉద్యోగుల్లో కొందరు సెలవులు తీసుకుని విచారణకు ఆటంకాలు కలిగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తీసుకెళ్లి సెలవులు పెడుతున్నారని ఆర్టీసీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ మెడికల్ సర్టిఫికెట్లు ఇప్పించడంలో కొంత మంది యూనియన్ నాయకులు సహకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆరు నెలలు అద్దె చెల్లించకపోతే డిపాజిట్‌గా ఉన్న సొమ్ము అద్దెగా జమ చేసుకుని స్టాల్స్ మూసి వేయాలి. అయితే ఇక్కడ మాత్రం సంవత్సర కాలంగా అద్దె చెల్లించకున్నా ఎలాంటి చర్యటూ తీసుకోలేదు. -
కమిషనరేట్ పరిధిలోకి జనగామ జిల్లా
సీఎం నిర్ణయంతో పెరిగిన పరిధి కొత్తగా నాలుగు ఏసీపీ కార్యాలయాలు వరంగల్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పెరిగింది. నూతనంగా ఏర్పడే జనగామ జిల్లాను కమిషనరేట్ పరిధిలో చేర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు పోలీస్‌శాఖ అధికారులు తాజాగా కసర త్తు ప్రారంభించారు. కొత్తగా ఏర్పడే వరంగల్, వరంగల్ (రూరల్), జనగామ జిల్లాలను వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలని తాజాగా నిర్ణయించారు. పరిపాలన పరంగా ఏ పోలీస్‌స్టేన్ ఏ డివిజన్ పరిధిలో ఉండాలనే విషయంపై ప్రతిపాదనలు పూర్తయ్యాయి. కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమయ్యే దసరా రోజు నుంచి కమిషనరేట్ పరిధిలోని కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తు తం వరంగల్, హన్మకొండ, కాజీపేట, మాము నూరు, క్రైం, ట్రాఫిక్, స్పెషల్‌బ్రాంచ్, ఏఆర్ ఏసీపీ పోస్టులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సంపేట, హుజూరాబాద్, జనగామలోని డీఎస్పీ కార్యాలయాలు ఏసీపీ ఆఫీసులుగా మారనున్నాయి. కొత్తగా కేయూసీ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, జనగామ ఏసీసీ పోస్టులు ఏర్పడుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్ పరిధిలోకి వస్తున్న పరకాల డీఎస్పీ పోస్టు రద్దు చేసి కేయూసీ ఏసీపీ పోస్టుగా, జనగామ డీఎస్పీ పోస్టు రద్దై ఏసీపీ పోస్టుగా మారనుంది. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 సాధారణ పోలీస్స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌స్టేషన్, ఒక క్రైం పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాల ఘన్పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట, రఘునాథపల్లి, గుండాల, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. కొత్త మండలాలుగా ఏర్పడే తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంట ఏర్పడే పోలీస్స్టేషన్లు కమిషరేట్ పరిధిలోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఐదు పోలీస్స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కాను న్న జనగామ జిల్లాలలోని పోలీస్స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి వస్తే మొత్తం 55 పోలీస్స్టేషన్ల తో కమిషనరేట్ పరిధి భారీగా పెరగనుంది. వరంగల్ : మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతె జార్గంజ్, లేబర్‌కాలనీ, ఏనుమాముల హన్మకొండ : హన్మకొండ, సుబేదారి, వడ్డెపల్లి, న్యూశాయంపేట కాజీపేట : కాజీపేట, మడికొండ, ధర్మసాగర్ నర్సంపేట : నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మామునూరు : మామునూరు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ హుజూరాబాద్ : కమలాపూర్, ఇల్లంతకుంట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి కేయూసీ : కేయూసీ, హసన్‌పర్తి, ఆరెపల్లి, ఆత్మకూరు, పరకాల, శాయంపేట వర్ధన్నపేట : వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్‌గఢ్, ఐనవోలు, పాలకుర్తి, కొడకండ్ల స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట, చిల్పూరు, వేలేరు జనగామ : జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాలఘనపూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, తరిగొప్పుల, గుండాల -
కొత్తగా మూడు ఏసీపీ కార్యాలయాలు
పరకాల డీఎస్పీ పోస్టు రద్దు... డివిజన్ల వారీగా స్టేషన్లు ఖరారు ప్రభుత్వ ఆమోదమే తరువాయి సాక్షిప్రతినిధి, వరంగల్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పోలీసు శాఖ పరంగా చేపట్టిన పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మార్పులకు ఓ రూపం వచ్చింది. కొత్తగా ఏర్పడబోయే వరంగల్, హన్మకొండ జిల్లాలను వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలని ఇప్పటికే నిర్ణయించారు. పరిపాలన పరంగా ఏ పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో ఉండాలనే విషయంపైనా ప్రతిపాదనలు పూర్తయ్యాయి. పోలీసు శాఖ సూచన మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు కమిషరేట్ తుదిరూపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. దసరాలోపే ఈ ప్రతిపాదనలకు ఆమోదం రానుంది. కొత్త జిల్లాలు ఏర్పడే దసరా రోజు నుంచి కమిషనరేట్ పరిధిలోనూ మార్పులు అమల్లోకి రానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం వరంగల్, హన్మకొండ, కాజీపేట, మామునూరు, క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీ పోస్టులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సంపేట, హుజూరాబాద్ల్లోని డీఎస్పీ కార్యాలయాలు ఏసీపీ ఆఫీస్‌లుగా మారనున్నాయి. కొత్తగా కేయూసీ, వర్ధన్నపేట, స్టేషన్ఘపూర్లో ఏసీపీ పోస్టులు మంజూరవుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్ పరిధిలోకి వస్తున్న పరకాల డీఎస్పీ పోస్టు రద్దు చేసి కేయూసీ ఏసీసీ పోస్టుగా మార్చనున్నారు. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 సాధారణ, మూడు ట్రాఫిక్, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నాయి. కొత్త మండలాలుగా ఏర్పడే చెల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంటల్లో ఏర్పాటయ్యే పోలీస్ స్టేషన్లు కమిషరేట్ పరిధిలోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఐదు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇలా మొత్తం 50 పోలీస్ స్టేషన్లతో కమిషనరేట్ పరిధి బాగా పెరగనుంది. ఏసీపీ కార్యాలయాల వారీగా పోలీస్ స్టేషన్లు వరంగల్ : మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్, లేబర్‌కాలనీ, ఎనుమాముల. హన్మకొండ : హన్మకొండ, సుబేదారి, వడ్డేపల్లి, న్యూశాయంపేట. కాజీపేట : కాజీపేట, మడికొండ, ధర్మసాగర్. నర్సంపేట : నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ. మామునూరు : మామునూరు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ. హుజూరాబాద్ : హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లంతకుంట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి. కేయూసీ : కేయూసీ, హసన్‌పర్తి, ఆరెపల్లి, ఆత్మకూరు, పరకాల, శాయంపేట. వర్ధన్నపేట : వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్‌గఢ్, ఐనవోలు, పాలకుర్తి, కొడకండ్ల. స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట, చిల్పూరు, వేలేరు. -
కొత్తగా ‘కాకతీయ’
తెరపైకి వరంగల్ రూరల్ జిల్లా 14 మండలాలతో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు నగరం మొత్తం ఒకే జిల్లాలో.. వరంగల్ జిల్లాలో భారీ మార్పులు తాజా ప్రతిపాదన ప్రకారం... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ధర్మసాగర్, చిల్పూరు, వేలేరు, స్టేషన్ ఘన్పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, జమ్మికుంట, ఇల్లంతకుంట. కాకతీయ జిల్లా : వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పరకాల, శాయంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి. సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన కొత్త మలుపు తిరుగుతోంది. వరంగల్ నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలని పలు వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొంది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సగం చొప్పున కేటాయిస్తూ ముసాయిదాలో పొందుపరిచారు. దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత మొదలైంది. వరంగల్ నగరాన్ని రెండు జిల్లాల్లో ఉంచే ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చేలా కొత్తగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్న హన్మకొండ జిల్లాలో గ్రేటర్ వరంగల్‌లోని తూర్పు నియోజకవర్గాన్ని చేర్చి.. వరంగల్ జిల్లాగా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ముసాయిదా జాబితాలో వరంగల్ జిల్లాగా పేర్కొన్న దానికి కొత్తగా కాకతీయ జిల్లాగా నామకరణం చేసే ఆలోచనలో ఉన్నారు. ముసాయిదాలో పేర్కొన్న ప్రతిపాదనలపైనే విమర్శలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రతిపాదనల తీరు మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. హన్మకొండ జిల్లాను పూర్తిగా తొలగించేందుకే కొత్తగా వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదా ప్రకారం... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ. హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట(కొత్తది). -
గందరగోళం సృష్టించేందుకే ప్రతిపక్షాల రాద్ధాంతం
ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్విభజన వరంగల్ నగరంలో జిల్లాల విభజనపై పునరాలోచించాలని సీఎంకు విన్నవిస్తాం వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ న్యూశాయంపేట : ప్రజలను గందరగోళపరిచేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రజాభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారని వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. నయీంనగర్‌లోని టీఆర్ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో శనివారం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేపట్టారని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి జిల్లాపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారన్నారు. ఏదో మునిగిపోయినట్టు కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బంద్‌కు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. చారిత్రాత్మక నగరాన్ని రెండుగా విభజించకుండా ఒక్కటిగా ఉంచేందుకు ముఖ్యమంత్రిని మరోసారి కలిసి విన్నవిస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేవలం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను మాత్రమే విడుదల చేశారని, ప్రజల అభిప్రాయ సేకరణ కోసం నెల రోజుల గడువు ఇచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడంపై పునరాలోచించాలని కోరుతూ లిఖితపూర్వకంగా కేసీఆర్‌కు లేఖ ఇస్తామన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా నష్టపోయిందని, అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని జిల్లాల పునర్విభజన చేపట్టారన్నారు. సమావేశంలో వరంగల్ నగరాన్ని హన్మకొండ జిల్లాగా విభజించే విషయంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో విభజన విషయంలో గందరగోళంలో ఉన్నట్లు కనిపించింది. విలేకరుల సమావేశంలో తాడు గౌరవ అద్యక్షుడు గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బోడా డిన్నా,చింతల యాదగిరి, రాజు, టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల ఏర్పాటుపై 1282 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి గురువారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొ త్తం 1282 అప్పీళ్లు అందాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్తజిల్లాలకు సంబంధిం చి అప్పీళ్లను పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు. ఈ విధానం సులభతరంగా ఉండేలా వెబ్సైట్లో సౌకర్యం కల్పించారు. ఇందు కోసం www.newdistricts formation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు అందజేయాలి. చేతిరాతతో రాసిన కాగి తం కానీ, డీటీపీ ద్వారా తయారు చేసి న డాక్యుమెంట్ స్కాన్ చేసి అభిప్రాయం వెబ్సైట్లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పీల్ ఫైల్ అయినట్లు దరఖాస్తుదారు సెల్‌కు సమాచారం వస్తుంది. -
మనదిక రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా
సాక్షి, సిటీబ్యూరో: జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్ జిల్లాను యథాతథంగా ఉంచారు. వాస్తవంగా హైదరాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి రెండుగా విభజించాలని మొదట అధికార యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. కానీ విపక్షాల వ్యతిరేకతతో ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద హైదరాబాద్ జిల్లా పాత ప్రాంతాలతోనే చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఇక సికింద్రాబాద్(లష్కర్) కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తారన్న ఆశ నిరాశ అయింది. మహానగరంలో రెవెన్యూ జిల్లాలు – కలెక్టర్ల పాత్ర పూర్తి నామమాత్రమే అయినప్పటికీ, రెవెన్యూ సరిహద్దులను మార్చొద్దని ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా తీర్మాణించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జిల్లాల విభజన కోసం రాసుకున్న మార్గదర్శకాలకు భిన్నంగా హైదరాబాద్ అతిపెద్ద జిల్లాగానే ఉంది. జిల్లా పరిధిలో అదనంగా మరో రెవెన్యూ డివిజన్‌తోపాటు రెండు మండలాలను పెంచాలనే యంత్రాంగం ప్రతిపాదనలకు కూడా బ్రేక్ పడింది. దీంతో హైదరాబాద్ జిల్లాలో పాతగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లతో సహా 16 మండలాలు యథాతథంగా ఉన్నాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అలాగే ఉన్నాయి. పెరగని రెవెన్యూ డివిజన్లు, మండలాలు హైదరాబాద్ జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా పెరగలేదు. జిల్లా జనాభా దాదాపుగా 40 లక్షల వరకు ఉంది. మండలాల పరిధిలో కూడా జనాభా అధికంగా ఉంది. రెండు, మూడు మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో జనాభా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనలో భాగంగా అదనంగా ఒక రెవెన్యూ డివిజన్‌తో పాటు రెండు మండలాలను కొత్తగా> పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్‌కు స్థానం దక్కక పోవటంతో కొత్త రెవెన్యూ డివిజన్, మండలాలకూ మోక్షం లభించలేదని తెలుస్తున్నది. 1.50 లక్షల జనాభాకు ఒక మండలం ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనను పరిగణనలోకి తీసుకున్నట్లయితే...తర్వాతనైనా మండలాల పెంపునకు అవకాశం ఉండగలదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందనే అంశం సర్కారు నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది. -
జనగామ జిల్లా బహుమతిగా ఇవ్వాలి
ప్రతిపక్ష పార్టీ నేతలకు రాఖీ కట్టి కోరిన మహిళా ప్రజాప్రతినిధులు జనగామ : జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20న నిర్వహించే ప్రజాప్రతినిధుల సమావేశంలో జనగామకు అనుకూలంగా వాణి వినిపించాలని కోరుతూ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో ప్రతిపక్ష పార్టీ నేతలను బుధవారం కలిశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, జిల్లా కోసం రాజీ నామా చేసిన 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల రజని, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, ప లువురు జేఏసీ నాయకులు తరలివెళ్లారు. టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్, అరవింద్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి జనగామ జిల్లా చేయాలని ఏకవాక్య తీర్మాణంతో సంపూర్ణ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. పలు పార్టీల నేతలకు మహిళా ప్రజాప్రతి నిధులు రాఖీ కట్టి జనగామ జిల్లా కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దశమంత్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీలకు చెందిన నేతలు జనగామ జిల్లాకు అనుకూలంగా పూర్తి సహకారం అందిస్తామన్నారని తెలిపారు. ఆయన వెంట జేఏసీ నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, ఆలేటి సిద్దిరాములు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళంపల్లి రాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, తీగల సిద్దుగౌడ్, బెడిదె మైసయ్య ఉన్నారు. -
లేఖల సెగ
జిల్లా పునర్విభజనలో కొత్త మలుపు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై ఆందోళనలు రాయపర్తి, జఫర్‌గఢ్‌లో ప్రజాగ్రహం ఎర్రబెల్లి, టి.రాజయ్య దిష్టిబొమ్మల దహనం ముత్తిరెడ్డి వైఖరికి నిరసనగా నేడు చేర్యాల బంద్ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అధికార పార్టీ శాసనసభ్యులకు తలనొప్పులు తెస్తోంది. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇచ్చిన ప్రతిపాదనలు ఆయా నియోజకవర్గాల్లో కొత్త చిచ్చు రేపుతున్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు చేసి తమ నియోజకవర్గాలను అందులో కలపాలని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రుల కమిటీకి లేఖలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలు పలు మండలాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యేలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రతిపాదనలు చేశారని రాయపర్తి, తొర్రూరు, జఫర్‌గఢ్, ధర్మసాగర్, చేర్యాల, మద్దూరు మండలాల ప్రజలు, మండల స్థాయి నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని ఆయా మండలాల నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గం మొత్తం ప్రజల మనోభావాల ప్రకారం వ్యవహరించాలిగానీ.. ఏకపక్షంగా ప్రతిపాదనలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేల లేఖలు ఇప్పుడు వారి నియోజకవర్గాల్లో రాజకీయ ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ‘నా పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఈ లేఖపై రాయపర్తి మండలంలో నిరసనలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్‌కు దగ్గరగా ఉండే తమ మండలాన్ని దూరంగా ఉండే జనగామ జిల్లాలో కలపడం ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వార్థరాజకీయాలకు నిదర్శమని డీసీసీ ఉపాధ్యక్షుడు బిల్ల సుధీర్‌రెడ్డి అన్నారు. తొర్రూరు మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించాలని... కొత్తగా ఏర్పాటయ్యే మహబూబాబాద్‌లో కలిపినా ఫర్వాలేదని తొర్రూరు జేఏసీ కన్వీనర్ కె.ప్రవీణ్‌రాజు పేర్కొన్నారు. ఈ రెండు ప్రతిపాదనలకు భిన్నంగా జనగామలో కలిపితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ‘నా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యే టి.రాజయ్య లేఖపై ధర్మసాగర్, జఫర్‌గఢ్ మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. జఫర్‌గఢ్ మండలం కూనూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జఫర్‌గఢ్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని, మంత్రుల కమిటీకి ఇచ్చిన లేఖను ఎమ్మెల్యే టి.రాజయ్య వెనక్కి తీసుకోవాలని మండలంలోని పలువురు నేతలు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ఏర్పాటు చేసి నియోజకవర్గం మొత్తాన్ని అందులోనే కలపాలని మంత్రుల కమిటీని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరడంపై చేర్యాల, మద్దూరు మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేర్యాల జేఏసీ, చాంబర్ ఆఫ్ కామర్స్, చేర్యాల పరిరక్షణ సమితి, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. చేర్యాల, మద్దూరు మండలాల్లో మంగళవారం(ఆగస్టు 16న) బంద్ నిర్వహిస్తున్నట్లు చేర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతినిధులు ఉడుముల భాస్కర్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. చేర్యాల, మద్దూరు మండలాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిపాదనలు ఇవ్వడం సరికాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే సహించేదిలేదని పేరొన్నారు. జనగామ జిల్లాలో చేర్యాల ప్రాంతాన్ని కలపాలని చెప్పడం స్వార్థరాజకీయ ప్రయోజనల కోసం ఇచ్చిన ప్రతిపాదన అని విమర్శించారు. -
మూడు.. నాలుగు!
సంక్లిష్టంగా మారిన జిల్లాల పునర్విభజన మంత్రుల కమిటీతో ప్రజాప్రతినిధుల భేటీ జనగామ జిల్లాపై ఎమ్మెల్యే విజ్ఞప్తులు ‘స్టేషన్’ సెగ్మెంట్‌ను కలపాలన్న రాజయ్య పాలకుర్తి మొత్తాన్ని విలీనం చేయాలని ఎర్రబెల్లి లేఖ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేక సెగ పసునూరి, కొండా మురళి, చల్లా డుమ్మా... సాక్షి ప్రతినిధి, వరంగల్ కొలిక్కి వచ్చిందని భావించిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ మళ్లీ సంక్లిష్టంగా మారుతోంది. వరంగల్ జిల్లాను వరంగల్, మహబూబాబాద్, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి) జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాజాగా జనగామ జిల్లా ఏర్పాటుపైనా జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రుల కమిటీకి లేఖలు ఇచ్చారు. దీంతో ఏ మండలాలు ఏ జిల్లాలో ఉంటాయనే విషయంపై అస్పష్టత మరింత పెరుగుతోంది. జిల్లాల పునర్విభజనపై ఏర్పాౖటెన మంత్రుల కమిటీ... మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో కూడిన కమిటీ.. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను ముందుగా ప్రజాప్రతినిధులకు వివరించింది. అనంతరం జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ అంశాలు ఇవీ... మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనల్లో పేర్కొనడంపై మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని మంత్రుల కమిటీని కోరారు. జనగామ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంత్రుల కమిటీని కోరారు. ఈ మేరకు నలుగురి సంతకాలతో కూడిన లేఖను మంత్రుల కమిటీకి అందజేశారు. జిల్లాకు కావల్సిన అన్ని సౌకర్యాలు జనగామకు ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల కోసం కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. 175 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున జిల్లా ఏర్పాటుకు జనగామ అన్ని విధాలుగా సరైనదేనని తెలిపారు. జనగామ జిల్లా ఏర్పాటుకు అన్ని రకాలుగా సరైనదనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రుల కమిటీకి ప్రత్యేకంగా లేఖ ఇచ్చారు. ‘నా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. జిల్లాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు జనగామకు ఉన్నాయని, జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ‘నా పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతోకాలంగా ప్రజల్లో ఉందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలను కలుపుతూ జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని రెండు సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గం మొత్తాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వ ప్రతిపాదనలలో పేర్కొనడంపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రుల కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. నెక్కొండ, చెన్నారావుపేట మండలాలపై ఎలాంటి ఒత్తిడి వచ్చినా ప్రస్తుత ప్రతిపాదనలనే కొనసాగించాలని కోరారు. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందని, ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, అరూరి రమేశ్, ఎమ్మెల్సీలు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రుల కమిటీకి తెలిపారు. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ నిర్వహించిన కీలక సమావేశానికి వరంగల్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరుకాలేదు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలను జనగామ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ప్రతిపాదనలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై ఆయా నియోజకవర్గాల్లోని ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రాయపర్తి, తొర్రూరు మండలాల్లో ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాజా ప్రతిపాదనల అంశం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ జరుగుతోంది. మంత్రుల కమిటీ జిల్లా ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ప్రతిపాదనలు వరంగల్ జిల్లా : వరంగల్, హన్మకొండ, హసన్‌పర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, శాయంపేట, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, çహుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాలు. ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం. మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, కొడకండ్ల, కొత్తగూడ, గార్ల, బయ్యారం. -
పునర్వ్యస్థీకరణపై కొత్త ప్రభుత్వం ఆలోచన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం కొత్త జిల్లాల ఏర్పాటుకు నాంది పలకనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారం దొరకనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... రంగారెడ్డి జిల్లాను ఐదు జిల్లాల పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును కూడా పూర్తి చేసిన ఆ పార్టీ అధినాయకత్వం 2016 నాటికి వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీంతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ కార్యరూపం దాల్చనుంది. పాలనా సౌలభ్యం కోసం.. మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి పేరిట 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో కేవలం 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. నగరీకరణ నేపథ్యంలో వలసల తాకిడి పెరగడంతో జిల్లా జన విస్పోటాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాల స్థానే 14 శాసనసభ సెగ్మెంట్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం పేర జిల్లాను విభజించాలనే చ ర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో... వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే అంశంపై చర్చోపచర్చలు సాగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. దీన్ని ఎన్నికల హామీగా మార్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తే వికారాబాద్ పరిసరాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాగా మలుస్తామని హామీ ఇచ్చాయి. శాస్త్రీయత పాటించకుండానే.. తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాలను ఏర్పాటు చేయాలనే టీఆర్ఎస్ పెద్దల ఆలోచన బాగా నే ఉన్నా.. అనుసరించిన విధానం మాత్రం హేతుబద్ధంగా లేదు. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాను ఐదు కొత్త జిల్లాల పరిధిలో కలపాలని ప్రణాళిక తయారు చేశారు. అయితే, భౌగోళికంగా, రవాణాపరంగా అ నువుగా ప్రాంతాలను జిల్లా కేంద్ర ంగా ప్రతి పాదించారు. తద్వారా పాలనా సౌలభ్యం దే వుడెరుగు ప్రజలకు కొత్త ఇబ్బందులు తప్పేలా లేవు. సగటున 15 లక్షల జనాభా, ఐదు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లా పునర్విభజనకు టీఆర్ఎస్ ప్రతిపాదనలు రూపొందించింది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని మలక్‌పేట, దాని సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను నల్గొండ జిల్లా భువనగిరి కేంద్రంగా ఏర్పడే రంగారెడ్డి తూర్పు జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రస్తుతం కూతవేటు దూరంలో ఉన్న జిల్లా కేంద్రం కాస్తా... సుదూరం కానుంది. ఇలాగే పలు నియోజకవర్గాలను కొత్త జిల్లాలో కలిపే అంశంపై శాస్త్రీయత పాటించనట్లు కనిపిస్తోంది. కాగా, పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నాలుగు నియోజక వర్గాలతో వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. తాండూరు, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల వాసులు ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పకపోయినా, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రం వికారాబాద్‌లో తమ ప్రాంతాన్ని విలీనం చేసే అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశంలేకపోలేదు. ఇదిలావుండగా, టీఆర్ఎస్ పెద్దలు రూపొందించిన జిల్లాల పునర్వ్యస్థీకరణ బ్లూప్రింట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను అడ్డగోలుగా విభజించాలని చూస్తే సహించేది లేదని, ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని భువనగిరి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపాలనుకోవడం అర్థరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సహేతుక కారణాలు చూపకుండా.. నిపుణులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏకపక్షంగా చేపడితే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.