కొత్తగా మూడు ఏసీపీ కార్యాలయాలు | NewThree ACP offices | Sakshi
Sakshi News home page

కొత్తగా మూడు ఏసీపీ కార్యాలయాలు

Published Mon, Oct 3 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

కొత్తగా మూడు ఏసీపీ కార్యాలయాలు

కొత్తగా మూడు ఏసీపీ కార్యాలయాలు

  • పరకాల డీఎస్పీ పోస్టు రద్దు...
  • డివిజన్ల వారీగా స్టేషన్లు ఖరారు
  • ప్రభుత్వ ఆమోదమే తరువాయి
  •  
    సాక్షిప్రతినిధి, వరంగల్‌ 
    జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పోలీసు శాఖ పరంగా చేపట్టిన పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో మార్పులకు ఓ రూపం వచ్చింది. కొత్తగా ఏర్పడబోయే వరంగల్, హన్మకొండ జిల్లాలను వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తేవాలని ఇప్పటికే నిర్ణయించారు. పరిపాలన పరంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ డివిజన్‌ పరిధిలో ఉండాలనే విషయంపైనా ప్రతిపాదనలు పూర్తయ్యాయి. పోలీసు శాఖ సూచన మేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు కమిషరేట్‌ తుదిరూపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. దసరాలోపే ఈ ప్రతిపాదనలకు ఆమోదం రానుంది. కొత్త జిల్లాలు ఏర్పడే దసరా రోజు నుంచి కమిషనరేట్‌ పరిధిలోనూ మార్పులు అమల్లోకి రానున్నాయి. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం వరంగల్, హన్మకొండ, కాజీపేట, మామునూరు, క్రైం, ట్రాఫిక్, స్పెషల్‌ బ్రాంచ్, ఏఆర్‌ ఏసీపీ పోస్టులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సంపేట, హుజూరాబాద్‌ల్లోని డీఎస్పీ కార్యాలయాలు ఏసీపీ ఆఫీస్‌లుగా మారనున్నాయి. కొత్తగా కేయూసీ, వర్ధన్నపేట, స్టేషన్‌ఘపూర్‌లో ఏసీపీ పోస్టులు మంజూరవుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్‌ పరిధిలోకి వస్తున్న పరకాల డీఎస్పీ పోస్టు రద్దు చేసి కేయూసీ ఏసీసీ పోస్టుగా మార్చనున్నారు. 
    వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో ప్రస్తుతం 19 సాధారణ, మూడు ట్రాఫిక్, ఒక మహిళా పోలీస్‌ స్టేషన్, ఒక క్రైం పోలీస్‌ స్టేషన్‌ ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్‌ రూరల్‌ పోలీస్‌ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, కరీంనగర్‌ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్‌ టౌన్, హుజూరాబాద్‌ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో కలపనున్నాయి. కొత్త మండలాలుగా ఏర్పడే చెల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంటల్లో ఏర్పాటయ్యే పోలీస్‌ స్టేషన్లు కమిషరేట్‌ పరిధిలోనే ఉంటాయి. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా ఐదు పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇలా మొత్తం 50 పోలీస్‌ స్టేషన్లతో కమిషనరేట్‌ పరిధి బాగా పెరగనుంది.
     
    ఏసీపీ కార్యాలయాల వారీగా పోలీస్‌ స్టేషన్లు
    • వరంగల్‌ : మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్, లేబర్‌కాలనీ, ఎనుమాముల.
    • హన్మకొండ : హన్మకొండ, సుబేదారి, వడ్డేపల్లి, న్యూశాయంపేట.
    • కాజీపేట : కాజీపేట, మడికొండ, ధర్మసాగర్‌.
    • నర్సంపేట : నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ.
    • మామునూరు : మామునూరు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ.
    • హుజూరాబాద్‌ : హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లంతకుంట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి.
    • కేయూసీ : కేయూసీ, హసన్‌పర్తి, ఆరెపల్లి, ఆత్మకూరు, పరకాల, శాయంపేట.
    • వర్ధన్నపేట : వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్‌గఢ్, ఐనవోలు, పాలకుర్తి, కొడకండ్ల.
    • స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట, చిల్పూరు, వేలేరు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement