లిప్‌ లాక్‌ చేస్తే ఊరుకోను! | Shahrukh Khan is very strict in disciplining children | Sakshi
Sakshi News home page

లిప్‌ లాక్‌ చేస్తే ఊరుకోను!

Published Wed, Jun 21 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

లిప్‌ లాక్‌ చేస్తే ఊరుకోను!

లిప్‌ లాక్‌ చేస్తే ఊరుకోను!

‘దేశానికి రాజైనా తల్లితండ్రులకు కొడుకే. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ఎంత పెద్ద స్టార్‌ అయినా పిల్లలకు మాత్రం తండ్రే. తన కుమార్తె సుహానా, కుమారుడు ఆర్యన్‌ క్రమశిక్షణ విషయంలో షారుక్‌ చాలా కఠినంగా ఉంటారు. సుహానా బాయ్‌ఫ్రెండ్‌తో, ఆర్యన్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉండే ఫొటోలు గతంలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. పిల్లల ఫ్రెండ్‌షిప్, ప్రేమ వ్యవహారాలపై బాద్‌షా  బహిరంగంగా స్పందిస్తూ ఉంటారు.

ఇటీవల కూడా ఓ ఇంటర్వూ్యలో పిల్లల క్రమశిక్షణపై స్పందించి, కూతురు, కొడుక్కి హెచ్చరికలు జారీ చేశారీ కింగ్‌ ఖాన్‌. ‘‘సుహానే పెదవులను తన బాయ్‌ ఫ్రెండ్‌ ముద్దు పెట్టుకుంటే వాడి పెదాలు కోసేస్తా. ఆర్యన్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌కి లిప్‌ కిస్‌ ఇచ్చినా, లేక గర్ల్‌ఫ్రెండే ఆర్యన్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చినా వాడి పెదాలు(ఆర్యన్‌) కోసేస్తా’’ అని బహిరంగంగా తన పిల్లలకు వార్నింగ్‌ ఇచ్చారు. ‘లిప్‌ కిస్‌’ పై షారుక్‌ ఎందుకంత సీరియస్‌ అయ్యారని కొందరు విమర్శించినా, పిల్లల మంచీ.. చెడూ ఆలోచించే బాధ్యత గల తండ్రిగా ఆయన కరెక్ట్‌గానే చెప్పారని మెజారిటీ వర్గం షారుక్‌ని అభినందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement