Suhana
-
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లిలో ఒర్రీ సందడి.. సెలబ్రిటీలందరితో పోజులు
-
రెడ్డి సుహానాను స్విమ్స్‌కు తరలించండి
చిత్తూరు,బి.కొత్తకోట: షుగర్ లెవల్స్‌లో వ్యత్యాసంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్నారని రెడ్డి సుహానా (1)ను తక్షణమే తిరుపతి స్విమ్స్‌కు తరలించాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త మంగళవా రం జిల్లావైద్యశాలల సేవల సమన్వయకర్త సరళమ్మను ఆదేశించారు. బి.కొత్తకోట మండలానికి చెందిన బావాజాన్ కుమార్తె రెడ్డి సుహానా ఆరోగ్య పరిస్థితిపై ‘సాక్షి’లో పలు కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించి ఆదుకునే చర్యలు అమలు చేసింది. ఇన్సులిన్ మందులు, ఫ్రిడ్జ్, సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల రెడ్డి సుహానా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం కావడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి తలలో నీరు చేరిందని, దానివల్లే తల పెద్దదైందని గుర్తించి వెల్లడించారు. శస్త్రచికిత్స చేయించాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ తక్షణమే చిన్నారి రెడ్డి సుహానాను బెంగళూరు నుంచి తిరుపతి స్విమ్స్ తరలించాలని అధికారులను ఆదేశించారు. స్విమ్స్‌లో శస్త్ర చికిత్స సాధ్యం కాకుంటే హైదరాబాద్‌లో మెరుగైన శస్త్ర చికిత్స చేయించేందుకు నిర్ణయించారు. బి.కొత్తకోటకు వచ్చిన సరళమ్మ స్థానిక ప్రభుత్వ వైద్యుడు అభిషేక్‌ను బెంగళూరు వెళ్లాలని సూచించారు. ఒక ఆరోగ్యమిత్రను వెంట పంపుతానని చెప్పారు. రెడ్డి సుహానాను అంబులెన్స్‌లో ఎలా తీసుకురావాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించారు. అడ్వాన్స్ లైవ్ సేవ్ అంబులెన్స్‌ను దీనికోసం వినియోగించాలని, అందుకయ్యే ఖర్చును పీహెచ్సీ నిధుల నుంచి చెల్లించాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా రెడ్డి సుహానా స్విమ్స్‌లో ఉండాలని సరళమ్మ చెప్పడంతో తీసుకొచ్చేందుకు డాక్టర్ అభిషేక్ బెంగళూరు వెళ్లారు. -
‘ఇన్నేళ్ల తరువాత ఒప్పుకుంది’
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి యూరప్ టూర్లో ఉన్నారు. టూర్‌కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు షారూఖ్. ఇటీవలలో ఆర్యన్, అబ్రామ్లు దిగిన ఫోటో, స్పెయిన్‌లో సుహానా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఆసక్తికర ఫోటోను ట్వీట్ చేశాడు షారూఖ్. తన భార్య గౌరీఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన షారూఖ్ ‘ఇన్నేళ్ల తరువాత నేను తీసిన ఫోటోను పోస్ట్ చేసేందుకు ఒప్పుకుంది’ అంటూ కామెంట్ చేశారు. జీరో షూటింగ్ పూర్తి చేసిన షారూఖ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. After years the wife has allowed me to post a pic I have taken...she’s @gaurikhan all heart! pic.twitter.com/QfAJajRlim — Shah Rukh Khan (@iamsrk) 7 July 2018 -
ఈ స్టార్ కిడ్ దారెటు..?
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ స్టార్ కిడ్‌గా అందరి చూపునూ తనవైపు తిప్పుకొంటోంది. పార్టీల్లో తరచూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే సుహానా ఇటీవల ఓ ఫ్యామిలీ వెడ్డింగ్లోనూ ఆకట్టుకుంది. వివాహ వేడుకలో మెరిసిన సుహానా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నాయి. సోహైల్ ఖాన్ భార్య, డిజైనర్ సీమా ఖాన్ సుహానా ఫోటోలను షేర్ చేశారు.ఇక ఈ ఏడాది జాన్వి కపూర్, ఇషాన్ కటర్, సారా అలీ ఖాన్ వంటి పలువురు స్టార్ కిడ్స్ ఆన్‌స్ర్కీన్ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో సుహానా సైతం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే సందేహాలు వెంటాడుతున్నాయి. -
లిప్ లాక్ చేస్తే ఊరుకోను!
‘దేశానికి రాజైనా తల్లితండ్రులకు కొడుకే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అయినా పిల్లలకు మాత్రం తండ్రే. తన కుమార్తె సుహానా, కుమారుడు ఆర్యన్ క్రమశిక్షణ విషయంలో షారుక్ చాలా కఠినంగా ఉంటారు. సుహానా బాయ్‌ఫ్రెండ్‌తో, ఆర్యన్ గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉండే ఫొటోలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. పిల్లల ఫ్రెండ్షిప్, ప్రేమ వ్యవహారాలపై బాద్షా బహిరంగంగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల కూడా ఓ ఇంటర్వూ్యలో పిల్లల క్రమశిక్షణపై స్పందించి, కూతురు, కొడుక్కి హెచ్చరికలు జారీ చేశారీ కింగ్ ఖాన్. ‘‘సుహానే పెదవులను తన బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకుంటే వాడి పెదాలు కోసేస్తా. ఆర్యన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి లిప్ కిస్ ఇచ్చినా, లేక గర్ల్‌ఫ్రెండే ఆర్యన్‌కు లిప్ కిస్ ఇచ్చినా వాడి పెదాలు(ఆర్యన్) కోసేస్తా’’ అని బహిరంగంగా తన పిల్లలకు వార్నింగ్ ఇచ్చారు. ‘లిప్ కిస్’ పై షారుక్ ఎందుకంత సీరియస్ అయ్యారని కొందరు విమర్శించినా, పిల్లల మంచీ.. చెడూ ఆలోచించే బాధ్యత గల తండ్రిగా ఆయన కరెక్ట్‌గానే చెప్పారని మెజారిటీ వర్గం షారుక్‌ని అభినందిస్తోంది. -
నా వల్లే మా అమ్మాయికి ఇబ్బంది!
సెలబ్రిటీలే కాదు.. వారి పిల్లలు కూడా ఏం చేసినా అది హాట్ టాపిక్ అవుతుంది. వారిని అటు అభిమానులతో పాటు ఇటు మీడియా సైతం ఫాలో అవుతూ ఉంటుంది. ఇతర రంగాల సెలబ్రిటీల ఫాలోయింగ్ ఒక ఎత్తయితే.. సినిమా రంగంలోని వారికి ఉండే ఫాలోయింగ్ మరో ఎత్తు అవుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ముద్దుల కుమార్తె సుహాన. ఈ టీనేజ్ బ్యూటీ బికినీలో ఉన్న ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షారుక్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘సుహాన వయస్సు ఇప్పుడు పదహారేళ్లు. బీచ్‌లో తన తమ్ముడు అభిరామ్‌తో కలసి ఆడుకుంటున్నప్పటి ఫొటోలు తీసి పబ్లిసిటీ చేయడం తగదు. పైగా షారుక్ కూతురు బీచ్‌లో బికినీతో బాడీ ప్రదర్శన ఇస్తోందని రాయడం సభ్యత కాదు. ఇటువంటి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి ఎందుకంత వివాదం చేస్తున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. సుహాన ఫొటో ఇలా వైరల్ కావడానికి కారణం నా స్టార్డమ్. అదే తన పాలిట శత్రువైందేమో అనిపిస్తోంది. తను నా కుమార్తె కాకుండా ఉంటే అసలు అది వార్త అయ్యుండేది కాదు. ఎవరూ చాటుమాటుగా ఫొటోలు తీసి, పరువు బజారుకీడ్చేవాళ్లు కాదు. సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన వారికి పర్సనల్ లైఫ్ ఉండదా? వయసుతో సంబంధం లేకుండా ఇటువంటి ఫొటోలు పెట్టి వివాదం చేయడం తగదు’’ అని ఆగ్రహావేదనలతో షారుక్ అన్నారు. ఓ తండ్రిగా ఆయన పడుతున్న బాధలో న్యాయం ఉంది కదూ!