ఖమ్మం స్పోర్ట్స్: యువతకు క్రమశిక్షణ నేర్పి వారి జీవన విధానంలో మంచి మార్పులు తెస్తున్న అంశాల్లో ఎన్‌సీసీ(నేషనల్ క్యాడెట్ క్యాప్స్)ది ప్రముఖ స్థానం. విద్యార్థుల్లో దేశాభక్తి, జాతీయ భావం. ధైర్య సాహసాలు పెంపొందించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. లక్ష్యంతో కూడుకున్న జీవన విధానానికి బాటలు చూపడం ఎన్‌సీసీ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో ఆదివారం రోజును ఎన్‌సీసీ దినోత్సవంగా పాటిస్తున్నాం.
1917లో ఆవిర్భవించిన ఎన్‌సీసీకి 1949 నుంచి దేశంలో అధికార హోదా పొందింది. 1980లో జిల్లాకు పరిచయమైన నాటి నుంచి నేటి వరకు 30వేల మందికి పైగా క్యాడెట్లను సమకూర్చింది. ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డేలో పాల్గొనే జిల్లా క్యాడెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2015లో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్ విద్యార్థులు ఈసారి కూడా ఎంపికయ్యూరు.
లక్ష్యం+క్రమశిక్షణ=ఎన్‌సీసీ
Published Sun, Nov 23 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement