
కూతురు అల్లరి చేస్తోందని పోలీసులకు ఫోన్
ఫ్లోరిడా: పిల్లలు అల్లరి చేస్తే పెద్దలు ఏం చేస్తారు. అల్లరి చేయొద్దని మందలిస్తారు. ఇంకా మాట వినకుంటే నాలుగు తగిలిస్తారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కూతురు అల్లరి మాన్పించాలంటూ ఏకంగా పోలీసులకు ఫోన్ చేశాడు. క్రమశిక్షణతో మెలిగేలా చూడాలని అభ్యర్థించాడు.
12 ఏళ్ల తన కుమార్తె చెప్పిన మాట వినడడం లేదని, ప్రతివిషయానికి గొడవ పడుతోందని పోలీసులకు చెప్పాడు. గతవారం సోదరితో వాగ్వాదానికి దిగిందని వాపోయాడు. పిల్లలను హింసిస్తే నేరం అవుతుందన్న ఉద్దేశంతో పోలీసులకు ఫోన్ చేసినట్టు వెల్లడించాడు. తన కుమార్తెను క్రమశిక్షణలో పెట్టాలని కోరాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక పోలీసులు తెల్లమొహం వేశారు.