పెద్దపల్లిరూరల్ : చదువుకోసం దూర, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, ఏసీపీ హబీబ్‌ఖాన్ అన్నారు. రంగంపల్లి గిరిజన వసతిగృహంలో అనాథ విద్యార్థులకు కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదానంకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. బీసీ, ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ చదివే విద్యార్థులు తాము పెద్దపల్లిలోని పాఠశాలకు వెళ్లి› రావడానికి ఇబ్బందులు పడుతున్నామని చైర్మన్ రాజయ్య దృíష్టికి తెచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఐ నరేందర్, ఎస్సై జగదీశ్, వార్డెన్లు స్వర్ణలత, రమేశ్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment