శుక్రవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్‡ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది.
Comments
Please login to add a commentAdd a comment