తిరుమల కొండపై నమాజ్‌.. వ్యక్తి అరెస్టు | man arrested over Namaz Performed on Tirupati Hills | Sakshi
Sakshi News home page

తిరుమల కొండపై నమాజ్‌.. వ్యక్తి అరెస్టు

Published Wed, Jan 25 2017 3:49 PM | Last Updated on Fri, Oct 19 2018 8:02 PM

తిరుమల కొండపై నమాజ్‌.. వ్యక్తి అరెస్టు - Sakshi

తిరుమల కొండపై నమాజ్‌.. వ్యక్తి అరెస్టు

తిరుపతి: తిరుమలలో నిఘాలోపం బయటపడింది. పరమ పవిత్రమైన తిరుమల కొండపై నమాజ్‌ చేస్తున్న ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠం కాంప్లెక్స్‌ క్యూ1 సమీపంలో  బుధవారం ఓ వ్యక్తి నమాజ్‌ చేస్తూ పట్టుబడ్డాడు. నమాజ్‌ చేయడాన్ని గుర్తించిన భక్తుల్లో ఒకరు  వీడియో తీసి భద్రతా సిబ్బందికి తెలిపారు. దీంతో ఆ వ్యక్తిని విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని పేరు అమీర్‌ అంజ అని మాత్రం తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement