కోలార్ (కర్ణాటక): స్కూలు ఆవరణలో శుక్రవారం రోజు ముస్లిం విద్యార్థులు నమాజ్ చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం ముల్బగల్ పట్టణంలోని బలెచంగప్ప ప్రభుత్వ పాఠశాల అనుమతివ్వడంపై పిల్లల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రోజు మధ్యాహ్నం ముస్లిం విద్యార్థులు ఓ తరగతి గదిలో నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరలైంది. దీంతో స్కూలు నిర్ణయానికి వ్యతిరేకంగా పిల్లల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సీఎం బసవరాజ్ బొమ్మై, కోలార్ ఎంపీ మునిస్వామి, విద్యా శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశాయి. పిల్లలు నమాజ్ చేసుకోవడానికి ఎందుకు అనుమతిచ్చారని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నుంచి తనకు శుక్రవారం ఫోన్ వచ్చిందని, తాను త్వరగా వెళ్లి చూడగా పిల్లలు నమాజ్ చేస్తూ కనిపించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment