ఈద్గాలలో ఈదుల్‌ఫిత్ర్ నమాజు వేళల
Published Sat, Jun 24 2017 11:56 PM | Last Updated on Fri, Oct 19 2018 8:02 PM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగరంలోని నాలుగు ఈద్గాలలో ఈదుల్‌ఫిత్ర్ నమాజు వేళలను ఆయా ఈద్గాల నిర్వాహకులు ప్రకటించారు. పాత ఈద్గా ముతవల్లి అయిన ప్రభుత్వ ఖాజీ సలీంబాషా ఖాద్రి మాట్లాడుతూ నెలవంక కనిపించిన మరుసటి రోజున రంజాన్ పండుగ నిర్వహిస్తామన్నారు. ఈద్గాకు వెళ్లేటప్పుడు అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్, అల్లాహు అక్బర్ అల్లాహుఅక్బర్ లాఇలాహ ఇల్లల్లాహు అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లా అల్‌హంద్ అని పఠించాలన్నారు. ఈద్గాకు వెళ్లే సమయంలో ఒక దారి, తిరిగి వచ్చే సమయంలో మరోదారిలో రావాలని మసీదుల్లో ప్రకటనలు జారీ చేశారు.
ఈద్గా నమాజు వేళలు
గడ్డా ఈద్గా -ఉదయం 7.00 గంటలు
జోహరాపురం ఈద్గా ఉదయం 7.15 గంటలు
పాత ఈద్గా ఉదయం 9.00 గంటలు
కొత్త ఈద్గా ఉదయం 10.00 గంటలు
Advertisement
Advertisement