సెప్టెంబర్ కల్లా రిలయన్స్ జియో 4జీ! | reliance jio 4g launch on september | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ కల్లా రిలయన్స్ జియో 4జీ!

Published Mon, Feb 24 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

సెప్టెంబర్ కల్లా రిలయన్స్ జియో 4జీ!

సెప్టెంబర్ కల్లా రిలయన్స్ జియో 4జీ!

 న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా 4జీ సర్వీసులను ప్రారంభించే అవకాశాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ ఢిల్లీ, ముంబైల్లో ఈ సర్వీసులను అందిస్తుందని సమాచారం.

 

దీనికి సంబంధించి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని, ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను కం పెనీ నియమించుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  7,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నామని, దీంతో తమ ఉద్యోగుల సంఖ్య 2014-15 చివరికి 10,000కు చేరుతుందని రిలయన్స్ జియో గతేడాది జూలైలోనే పేర్కొంది.

 

కాగా, ఈ కంపెనీ ప్రయోగ పద్ధతిన 4జీ సర్వీసులను ఇప్పటికే ఢిల్లీ, ముంబై, జామ్‌నగర్‌లో ప్రారంభించింది.  ఇందులో 49 ఎంబీపీఎస్ స్పీడ్‌ను అం దిస్తోంది. ఇది 3జీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్(4ఎంబీపీఎస్) కంటే 10-12 రెట్లు అధికం. 49 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఒక పూర్తి సినిమాను  2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement