![Girl Jumps From Terrace to Escape Molestation Bid - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/6/girl.jpg.webp?itok=Idr15OKy)
ముంబై : లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక(12) నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం ముంబయిలోని పాల్‌ఘార్ జిల్లా ఆల్‌కాపూరి కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటి వద్ద ఉన్న బాలిక దగ్గరకు వచ్చి కాగితం చూపించి చిరునామా అడిగాడు. అంతేకాక ఆ బాలికకు మాయ మాటలు చెప్పి అడ్రస్ చూపించమని తన వెంట తీసుకెళ్లాడు.
ఆ వ్యక్తి ఓ భవనంపైకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిగటించిన బాలిక అతని నుంచి తప్పించుకోవటానికి భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర గాయాలైనా ఆ బాలికను నగరంలోని నాయర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment