సాక్ష, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పుర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అతని భార్య, కుమారుడు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై నిద్రలోనే ప్రాణాలు విడిచారు. వారి గదిలో రూమ్ మీటరు స్విచ్ ఆన్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. సతీష్‌కుమార్, భార్య శశి, ఐదు నెలల కొడుకు అర్చిత్‌తో కోట్లా ముబారక్‌పుర్‌లో అద్దెకు ఉండేవాడు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలైనా వారి ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో మొత్తం కుటుంబం మరణించి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం ఎనిమిదిన్నరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రూమ్‌హీటర్ కారణంగానే సతీష్‌కుమార్ కుటుంబం దుర్మరణం చెందిందని గుర్తించారు. చలి తీవ్రతను తట్టుకోలేక రూము హీటరు ఆన్ చేసి, తలుపులు కిటికీలు అన్నీ గట్టిగా మూసి నిద్రపోవడంతో ఆక్సీజన్ అందక చనిపోయారని పోలీసులు తెలిపారు.
రూమ్ హీటరుతో ఊపిరాడక ఇంజనీర్ కుటుంబం దుర్మరణం
Published Wed, Dec 31 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM
Advertisement
Advertisement