6 Members Of Family Found Dead Under Mysterious Circumstances In Udaipur, Details Inside - Sakshi
Sakshi News home page

ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి.. అసలేం జరిగింది?

Published Mon, Nov 21 2022 2:42 PM | Last Updated on Mon, Nov 21 2022 3:40 PM

Family Found Dead Under Mysterious Circumstances At Udaipur - Sakshi

ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. కాగా, మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉండటం అందరిని విషాదానికి గురిచేసింది. 

వివరాల ప్రకారం.. ప్రకాశ్‌ కుటుంబం ఉదయ్‌పూర్‌లోని గోగుండా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ప్రకాశ్‌కు భార్య దుర్గాగోమతి(27), వారి నలుగురు పిల్లలు కలిసి ప్లాట్‌లో నివసిస్తున్నారు. కాగా, ప్రకాశ్‌.. గుజరాత్‌లో పని చేస్తూ బస్సుల్లో ఆహారాన్ని విక్రయించేవాడు. ప్రకాశ్‌ సోదరులు కూడా అతడి ఇంటికి దగ్గరలోనే నివసిస్తున్నారు. అయితే, సోమవారం ప్రకాశ్‌.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అతడి సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు ఓపెన్‌ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ చనిపోయి ఉండటం గమనించారు. ఈ సందర్భంగా ఘటనపై అడిషనల్ ఎస్పీ కుందన్ కన్వారియా వివరాలు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రకాశ్‌ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము. ప్రకాశ్‌ మొదట కుటుంబ సభ్యులను చంపి.. తర్వాత తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని అన్నారు.  ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ చేరుకున్నట్టు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement