
పట్నా: ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడి ఆరుగురు బాలికలు మృతి చెందిన ఘటన బిహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. రాజస్తాన్ నుంచి టైల్స్ తీసుకువస్తున్న భారీ ట్రాలీ గోపాల్‌గంజ్ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడే ఆడుకుంటున్న ఆరుగురు బాలికలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment