సివాన్ : బీహార్లోని సివాన్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా, సుమారు పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు ఉదయం విద్యార్థులతో వెళుతున్న ఆటో ... మినీ బస్సును ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు విడిచారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు గాయపడినవారికి సరైన చిక్సిత అందించటం లేదంటూ ఆస్పత్రి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందిపైనా దాడులు చేశారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం
Published Mon, Apr 20 2015 10:29 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM
Advertisement
Advertisement