నిజామాబాద్: పంటరుణాలు రెన్యువల్ చేయాలంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని పచ్చలనరుకుడు గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక డీజీబీ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. త్వరగా రుణాలు రెన్యూవల్ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు.