ఇటీవల తమిళనాడులో సాధారణ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 9000కోట్లు జమయ్యాయన్న వార్త సోషల్ మీడియా ద్వారా తెగ చక్కర్లు కొట్టింది. ఆ వ్యక్తి ఇంత డబ్బు వచ్చిందని సంతోషపడేలోపు అతని ఆశలన్నీ ఆవిరైపోయాయి. కాగా దీనికి కారణమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ తన పదవికి రాజీనామా చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'ఎస్ కృష్ణన్' గురువారం తన రాజీనామాను సమర్పించారు. చెన్నై క్యాబ్ డ్రైవర్‌కు రూ.9,000 కోట్లు తప్పుగా జమ చేసిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే తన రాజీనామాకు ఇది కాదని, కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే అని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో
గతేడాది సెప్టెంబర్‌లో టీఎంబీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ 2023 సెప్టెంబరు 28న జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రాజీనామాను ఆమోదించి, వారి మార్గదర్శకత్వం లేదా సలహా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి ఫార్వార్డ్ చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది.
డ్రైవర్‌కు రూ.9,000 కోట్లు ఖాతాలో యాడ్ అవ్వగానే ఇదేదో స్కామ్ అనుకున్నాడు, కానీ అనుమానంతో తమ ఫ్రెండుకు రూ. 21,000 ట్రాన్స్‌ఫర్ చేసాడు. ఈ ట్రాన్స్‌ఫర్ సక్సెస్ అవ్వడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఇది జరిగిన కేవలం కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ మొత్తాన్ని బ్యాంక్ డెబిట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment