bank ceo
-
సీఈఓల జీతాలు పెంపు!
ప్రైవేట్ బ్యాంకులకు సారథ్యం వహించే సీఈఓల వేతనాలు గతేడాదితో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగాయి. బ్యాంకుల్లో కీలకమైన మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగుల జీతం, బోనస్‌లు, స్టాక్ ఆప్షన్లకు సంబంధించిన వెసులుబాటును పెంచాలంటే ఆర్బీఐ అనుమతులు తప్పనిసరి. ఈ వ్యవహారంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు దృష్టి సారించినట్లు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.కొన్ని నివేదికల ప్రకారం.. ప్రముఖ బ్యాంకుల సీఈఓల వేతనాలు కింది విధంగా ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్-శశిధర్ జగదీషన్ వేతనం 2024లో రూ.10.77 కోట్లు, 2023లో రూ.10.54 కోట్లు, స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,09,131.ఐసీఐసీఐ బ్యాంక్-సందీప్ భక్షి, 2024లో రూ.9.96 కోట్లు, 2023లో రూ.9.57 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,99,100.యాక్సిస్ బ్యాంక్-అమితాబ్ చౌదరి, 2024లో రూ.9.64 కోట్లు, 2023లో రూ.9.75 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 3,13,300.ఇండస్ఇండ్ బ్యాంక్-సుమంత్ కత్పలియా, 2024లో రూ.8.5 కోట్లు, 2023లో రూ.8.5 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 1,98,000.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్-వీ.వైద్యనాథన్, 2024లో రూ.5.3 కోట్లు, 2023లో రూ.4.45 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 30,59,514.యెస్ బ్యాంక్-ప్రశాంత్ కుమార్, 2024లో రూ.3.77 కోట్లు, 2023లో రూ.3.47 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 48,16,490.ఇదీ చదవండి: ఏ ధర ఫోన్లను ఎక్కువగా కొంటున్నారంటే..ప్రైవేట్ బ్యాంకుల మొదటి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా బ్యాంకులు వార్షిక సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అందులో సీఈఓల జీతాల పెంపునకు ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. దాంతో వారి వేతనాలు పెరిగినట్లు రెగ్యులేటరీలకు రిపోర్ట్ చేశాయి. ఇదిలాఉండగా, త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకులు పెద్దగా లాభాలను పోస్ట్ చేయలేదు. ఇటీవల ఆర్బీఐ మానిటరీ సమావేశంలోనూ రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్‌లో నిర్వహించే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే దేశీయంగా ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగా జరిగితే బ్యాంకులకు సానుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
డ్రైవర్‌కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
ఇటీవల తమిళనాడులో సాధారణ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 9000కోట్లు జమయ్యాయన్న వార్త సోషల్ మీడియా ద్వారా తెగ చక్కర్లు కొట్టింది. ఆ వ్యక్తి ఇంత డబ్బు వచ్చిందని సంతోషపడేలోపు అతని ఆశలన్నీ ఆవిరైపోయాయి. కాగా దీనికి కారణమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ తన పదవికి రాజీనామా చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'ఎస్ కృష్ణన్' గురువారం తన రాజీనామాను సమర్పించారు. చెన్నై క్యాబ్ డ్రైవర్‌కు రూ.9,000 కోట్లు తప్పుగా జమ చేసిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే తన రాజీనామాకు ఇది కాదని, కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే అని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో గతేడాది సెప్టెంబర్‌లో టీఎంబీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ 2023 సెప్టెంబరు 28న జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రాజీనామాను ఆమోదించి, వారి మార్గదర్శకత్వం లేదా సలహా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి ఫార్వార్డ్ చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. డ్రైవర్‌కు రూ.9,000 కోట్లు ఖాతాలో యాడ్ అవ్వగానే ఇదేదో స్కామ్ అనుకున్నాడు, కానీ అనుమానంతో తమ ఫ్రెండుకు రూ. 21,000 ట్రాన్స్ఫర్ చేసాడు. ఈ ట్రాన్స్ఫర్ సక్సెస్ అవ్వడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఇది జరిగిన కేవలం కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ మొత్తాన్ని బ్యాంక్ డెబిట్ చేసింది. -
CrossBorderTrade: డాలర్‌తో పనిలేకుండా రూపాయితో!
న్యూఢిల్లీ: సీమాంతర వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు రూపాయి మారకంలో నిర్వహించే మార్గాలపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యూఎస్ డాలర్‌కు బదులుగా రూపాయిలో సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహించే మార్గాలను చర్చించేందుకు డిసెంబరు నెల 5న బ్యాంకుల చీఫ్‌లతో చర్చించనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్) ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆరు అగ్రగామి ప్రైవేటు బ్యాంకుల సీఈవోలను సమావేశానికి ఆహ్వానించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఇతర భాగస్వాములు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిపాయి. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. (ఇండియన్ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్ నీలేకని) కంపెనీల కొనుగోళ్ల నిబంధనల సమీక్ష సెబీ అత్యున్నత స్థాయి కమిటీ కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను సులభతరం చేయడానికి, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు వీలుగా సెబీ ఓ అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. న్యాయస్థానాల గత తీర్పుల కోణంలో ప్రస్తుత నిబంధనలను సమీక్షించనున్నారు. 20 మంది సభ్యుల కమిటీకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ షివాక్స్ జల్ వాజిఫ్‌దార్ నేతృత్వం వహించనున్నారు. సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, న్యాయ సేవల సంస్థల సభ్యులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. గణనీయ మొత్తంలో షేర్ల కొనుగోలు లేదా కంపెనీల కొనుగోలు విషయంలో నిబంధనలపై తమ సూచనలు అందించనున్నారు. చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..! -
మాసబ్ ట్యాంకు కాల్పుల కేసులో పురోగతి
హైదరాబాద్:ఇటీవల మాసబ్ ట్యాంకులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొన్నిరోజుల క్రితం బ్యాంకు సీఈవో మన్మథ్‌దలాయ్ పై కాల్పులకు పాల్పడిన నిందితుల్ని రాజమండ్రికి చెందిన యువకులుగా గుర్తించారు. బ్యాంకు సీఈవో వద్ద డబ్బులుంటాయని భావించి వారు దోపిడీ యత్నం చేశారు. బ్యాంకు సీఈవో డ్రైవర్ సాయంతో ఆ యువకులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. గత ఆదివారం కృష్ణ భీమ సమృద్ధి లోకల్ ఏరియా (కేబీఎస్) బ్యాంక్ ఎండీ, సీఈవో మన్మథ్‌దలాయ్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. మాసబ్ ట్యాంక్‌లోని శాంతినగర్‌లో శ్రీదుర్గ కనుముల్లి అపార్ట్మెంట్లో మన్మథ్‌దలాయ్ తన కుటుంబంతో ఉండగా దోపిడీకి యత్నించిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం కావడంతో మరికొన్ని రోజుల్లో సృష్టత వచ్చే అవకాశం ఉంది. సీఈవోపై కాల్పులు జరిపిన యువకులు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు సాగుతోంది.