ప్రైవేట్ బ్యాంకులకు సారథ్యం వహించే సీఈఓల వేతనాలు గతేడాదితో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగాయి. బ్యాంకుల్లో కీలకమైన మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగుల జీతం, బోనస్‌లు, స్టాక్ ఆప్షన్‌లకు సంబంధించిన వెసులుబాటును పెంచాలంటే ఆర్‌బీఐ అనుమతులు తప్పనిసరి. ఈ వ్యవహారంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు దృష్టి సారించినట్లు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.
కొన్ని నివేదికల ప్రకారం.. ప్రముఖ బ్యాంకుల సీఈఓల వేతనాలు కింది విధంగా ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్-శశిధర్ జగదీషన్ వేతనం 2024లో రూ.10.77 కోట్లు, 2023లో రూ.10.54 కోట్లు, స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,09,131.
ఐసీఐసీఐ బ్యాంక్-సందీప్ భక్షి, 2024లో రూ.9.96 కోట్లు, 2023లో రూ.9.57 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 2,99,100.
యాక్సిస్ బ్యాంక్-అమితాబ్ చౌదరి, 2024లో రూ.9.64 కోట్లు, 2023లో రూ.9.75 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 3,13,300.
ఇండస్‌ఇండ్ బ్యాంక్-సుమంత్ కత్పలియా, 2024లో రూ.8.5 కోట్లు, 2023లో రూ.8.5 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 1,98,000.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్-వీ.వైద్యనాథన్, 2024లో రూ.5.3 కోట్లు, 2023లో రూ.4.45 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 30,59,514.
యెస్ బ్యాంక్-ప్రశాంత్ కుమార్, 2024లో రూ.3.77 కోట్లు, 2023లో రూ.3.47 కోట్లు. స్టాక్ ఆప్షన్స్ రూపంలో 48,16,490.
ఇదీ చదవండి: ఏ ధర ఫోన్లను ఎక్కువగా కొంటున్నారంటే..
ప్రైవేట్ బ్యాంకుల మొదటి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా బ్యాంకులు వార్షిక సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అందులో సీఈఓల జీతాల పెంపునకు ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. దాంతో వారి వేతనాలు పెరిగినట్లు రెగ్యులేటరీలకు రిపోర్ట్ చేశాయి. ఇదిలాఉండగా, త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకులు పెద్దగా లాభాలను పోస్ట్ చేయలేదు. ఇటీవల ఆర్‌బీఐ మానిటరీ సమావేశంలోనూ రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్‌లో నిర్వహించే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే దేశీయంగా ఆర్‌బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగా జరిగితే బ్యాంకులకు సానుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment