సాక్షి, బెంగళూరు : రుణం కావాలంటే కోరిక తీర్చాలంటూ వెకిలీ వేషాలు వేసిన ఓ బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదింది. కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేవనగెరెలోని డీహెచ్‌ఎఫ్‌ఎల్ లోన్ ఏజెన్సీలో దేవయ్య అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఓ మహిళ తనకు రుణం కావాలని ఆయనను కోరింది. రూ. 2 లక్షల రుణం ఇప్పించాల్సిందిగా అభ్యర్థించగా.. దేవయ్య వెకిలీ బుద్ధి చూపించాడు. లోన్ ఇవ్వాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమె వేధించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళ.. సదరు కీచకుడిని రోడ్డుమీదకు లాగి దేహశుద్ధి చేసింది. మొదట కర్రతో చితకబాది.. ఆ తర్వాత చెప్పు తీసుకొని చెడామడా వాయించింది. కన్నడ భాషలో అతన్ని తిడుతూ.. గట్టిగా బుద్ధిచెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
కీచక బ్యాంకు మేనేజర్‌ను చితకబాదిన మహిళ
Published Tue, Oct 16 2018 12:49 PM | Last Updated on Tue, Oct 16 2018 1:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment