కడప సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, వారికి బ్యాంకుల ద్వారా రుణాలందిస్తామని డీఆర్‌వో ఈశ్వరయ్య తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమైక్యాంధ్ర ఉద్యమంపై సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు సమ్మెలో ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ బిల్లులు పాస్ కావడం లేదని తెలిపారు. చిరు ఉద్యోగులు సమ్మెతో కష్టాలు, నష్టాలకు గురికావలసి వస్తోందన్నారు. ఇలాంటి వారందరి కోసం బ్యాంకుల ద్వారా రుణాలందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా పలు బ్యాంకు అధికారులతో రుణాల విషయం చర్చించామన్నారు. సమావేశంలో ట్రెజరీ జిల్లా అధికారులు రంగప్ప, నాగరాజు, బాలసుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, ఎన్జీవో సంఘం నాయకులు కెవి శివారెడ్డి, శ్రీనివాసులు, జి. రవికుమార్, రామ్మూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు బ్యాంకు రుణాలకు సన్నాహాలు
Published Sun, Sep 29 2013 3:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement