State Guest House
-
కిలకిలరావాల రోజ్ పీటర్స్.. స్టేట్ గెస్ట్ హౌస్ ఏరియా కేరాఫ్ అడ్రస్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంతం.. అక్కడ ఏ చెట్టుపై చూసినా పిట్టల గుంపులే. సెల్ టవర్లు, విద్యుత్ తీగలు ఇలా వాలేందుకు అనువుగా ఉన్న ప్రతిచోటా పక్షుల సందడే. సాయంత్రం అయిందంటే చాలు ఆ ప్రాంతం వేలాదిగా వచ్చే రోజ్ పీటర్స్ పక్షుల కిలకిలరావాలతో సందడిగా మారిపోతుంది. ఏటా ఇదే సీజన్లో వచ్చే ఈ పక్షులకు స్టేట్ గెస్ట్ హౌస్ ఏరియా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. – కందుల చక్రపాణి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, విజయవాడ) కూర్మం కాదు..కంద! సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం ఎరుకలపూడిలో ప్రకృతి రైతు ముళ్లపూడి రంగయ్య వ్యవసాయ క్షేత్రంలో కంద దుంప ఒకటి 17 కిలోల బరువు ఊరింది. ఇది చూడటానికి తాబేలు ఆకారాన్ని పోలినట్లు ఉంది. రంగయ్య తన ఇంటిదగ్గరి క్షేత్రంలో ప్రకృతి పద్ధతుల్లో రకరకాల పండ్లతోపాటు కందను సాగుచేస్తున్నారు. – ఎరుకలపూడి (తెనాలి) -
మంత్రి పేరుతో గోవాలో జల్సా..
పనాజీ: ఉత్తరప్రదేశ్ మంత్రినంటూ నకిలీ పత్రాలతో బురిడీ కొట్టించి పనాజీలోని రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో పదిరోజుల పాటు రాచమర్యాదలు అందుకున్న వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు గెస్ట్‌హౌస్‌లో మర్యాదలు అందుకున్న మరో నలుగురు అనుచరులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గోవా క్రైమ్ బ్రాంచ్ అధికారి వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పోలీసులను అప్రమత్తం చేయడంతో నిందితుడు సునీల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. సింగ్ పట్టుబడిన సమయానికే 12 రోజుల పాటు అతిధి గృహంలో ఎంచక్కా ఆతిథ్యం స్వీకరించాడు. నిందితుడు గోవా సీఎం అపాయింట్మెంట్ను కోరాడని అధికారులు తెలిపారు. యూపీ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నానని సంబంధిత పత్రాలు చూపడంతో నిందితుడికి గోవా పోలీసులు వ్యక్తిగత భద్రతాధికారిని కూడా సమకూర్చారని అధికారులు వెల్లడించారు. సింగ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో గోవా పోలీసులకు సీఎం ప్రమోద్ సావంత్ సమాచారం ఇచ్చారు. నిందితుడు గత వారం గోవా సహకార మంత్రి గోవింద్ గవాడేతో కూడా భేటీ అయి సంబంధిత శాఖకు చెందిన పలు అంశాలపై చర్చించాడని తెలిసింది. -
దసరాకు సీఎం కొత్త నివాసం
* కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు వేగవంతం * రాష్ట్ర అతిథి గృహంగా మారనున్న ప్రస్తుత క్యాంపు ఆఫీసు * వీవీఐపీల తాత్కాలిక విడిదికి వినియోగం సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్త క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతమున్న ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్ స్థలంలో ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం, నివాస భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలోనే ఈ పనులను ప్రారంభించారు. మరోవైపు సీఎం కొత్త భవనంలోకి మారాక ప్రస్తుత నివాసాన్ని కూలుస్తారా లేదా ఇతర అధికారిక అవసరాలకు వినియోగిస్తారా అనే అంశంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరపడింది. రాష్ట్రానికి వచ్చే వీవీఐపీలు, ప్రముఖులకు విడిది కల్పించేందుకు వీలుగా ప్రస్తుతమున్న క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్‌గా మార్చాలని ముఖ్యమంత్రి సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ అతిథిగృహంగా ఉన్న లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంగా మార్చటంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ అతిథి గృహం లేకుండాపోయింది. దీనివల్ల ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ అతిథులకు వసతి కల్పించటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఫలితంగా వీవీఐపీలకు స్టార్ హోటళ్లలో సూట్లను బుక్ చేయాల్సి వస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ తొలుత దిల్కుషా, మంజీరా, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లలో ఒక దాన్ని ప్రభుత్వ అతిథిగృహంగా మార్చాలని భావించారు. ఇందుకోసం ఆయనే స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు. కానీ ప్రస్తుత అవసరాలకు అవి సరిపోవటం లేదని, సౌకర్యాల ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో సీఎంకు కొత్త భవన సముదాయం నిర్మాణం వేగవంతం కావటంతో పాత క్యాంపు కార్యాలయాన్ని అతిథి గృహంగా మార్చాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దసరాకు కొత్త క్యాంపు ఆఫీసు సిద్ధమైతే నవంబర్‌కల్లా ఈ నివాస భవనం ఖాళీ అవుతుంది. దీన్ని కూడా గతంలో ఆధునిక హంగులతో నిర్మించారు. దీంట్లో కొన్ని వాస్తు లోపాలు ఉన్నాయని నిపుణులు సూచించడంతో ఆ మేరకు మార్పుచేర్పులు చేశాకే సీఎం కేసీఆర్ అందులో అడుగుపెట్టారు. ప్రస్తుతం అందులోని నివాస భవనాన్ని మాత్రమే ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్నారు. బేగంపేట మెయిన్ రోడ్డు వైపు ఉన్న క్యాంపు కార్యాలయాన్ని ఖాళీగానే వదిలేశారు. కేవలం సీఎం భద్రతా సిబ్బంది అవసరాలకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ దసరాకు సీఎం కొత్త భవనంలోకి మారగానే భద్రతా సిబ్బంది సైతం అక్కడికే మకాం మార్చనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను ఉంటున్న అధికారిక భవనాన్ని, దానికి అనుసంధానంగా ఉన్న క్యాంపు కార్యాలయాన్ని అధునాతనంగా తీర్చిదిద్ది స్టేట్ గెస్ట్ హౌస్‌గా మార్చాలని సీఎం రోడ్లు భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ స్థాయి వీవీఐపీలకే ఈ భవనాన్ని కేటాయించాలని సూచించారు. ఎవరెవరి వసతికి దీన్ని ఉపయోగించాలనే విషయంలో ప్రొటోకాల్ విభాగం ప్రత్యేకంగా ఒక జాబితాను తయారు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. -
స్టేట్ గెస్ట్‌హౌస్‌గా క్యాంపు కార్యాలయం
సీఎం కొత్త భవనంలోకి మారగానే అతిథిగృహంగా ప్రస్తుత నివాసం పరిశీలించాల్సిన అధికారులకు సీఎం ఆదేశం ‘లేక్‌వ్యూ’ను ఏపీ సీఎంకు కేటాయించటంతో స్టేట్‌గెస్ట్‌హౌస్ అవసరం హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కొత్త భవన సముదాయం సిద్ధం కాబోతోంది. సుమారు రూ.33 కోట్ల వ్యయం తో దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో బేగంపేటలో దీన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తికాగానే ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం అందులోకి మారుతుంది. మరి... ప్రస్తుతం ఉన్న నివాసం, క్యాంపు కార్యాలయాన్ని ఏం చేస్తారు? స్పీకర్‌కు కేటాయిస్తారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంగా మారుస్తారని... ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ దాని విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో లా ఆలోచిస్తున్నారు. ఆ భవనాన్ని రాష్ట్రప్రభుత్వ అధికారిక అతిథిగృహంగా మార్చాలని భావిస్తున్నారు. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఆయన సూచన చేశారు. ప్రస్తుత నివాసాన్ని స్టేట్‌గెస్ట్ హౌస్‌గా మారిస్తే ఎలా ఉంటుందో పరిశీలించి చెప్పాల్సిందిగా ఆదేశించారు. వారి నుంచి వచ్చే నివేదిక ఆధారం గా ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ ఏపీకి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అధికారిక అతిథి గృహంగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ కొనసాగింది. నగరానికి వచ్చే ప్రముఖులకు దాన్ని విడిదిగా కేటాయించేవారు. అందుకుతగ్గట్టుగానే అది దర్పంగా ఉండటంతో మరో అతిథిగృహం అవసరం పడలేదు. ఒకేసారి ఇద్దరు.. ముగ్గిరికి కేటాయించాల్సిన పరిస్థితి వస్తే దాని సమీపంలోనే ఉన్న దిల్కుషా గెస్ట్‌హౌస్‌ను వినియోగించేవారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండటంతో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం కోసం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం దాన్ని ఏపీ ముఖ్యమంత్రి పెద్దగా వినియోగించనప్పటికీ పదేళ్లపాటు ఏపీ ఆధీనంలోనే అది ఉండనుంది. దీంతో తెలంగాణకు అధికారిక అతిథిగృహం లేకుండాపోయింది. ప్రముఖులు వస్తే హోటళ్ల లో ఉంచాల్సి వస్తోంది. దీంతో కొత్త అతిథి గృహం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చాలారోజులుగా ఆలోచిస్తున్నారు. ఇటీవల సచివాల యం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఉన్నట్టుండి దిల్కుషా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి దాన్ని పరిశీలించారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌గా దాన్ని మారి స్తే బాగుంటుందని ఆయన భావించి రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచనలు చేశా రు. కానీ ఆ భవనం పాతబడినందున దానికి మార్పుచేర్పులు చేయటం సరికాదని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను వినియోగిస్తున్న క్యాంపు కార్యాలయం, అధికారిక నివాసాన్ని గెస్ట్‌హౌస్‌గా మార్చటమే ఉత్తమమని ఆయన తాజాగా అధికారుల దృష్టికి తెచ్చారు. విశాలంగా ఉండటం, విడివిడిగా రెండు భవనాలు, అధునాతన వసతులతో ఉన్నందున అది స్టేట్ గెస్ట్‌హౌస్‌గా మారిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత నివాసం గురించి.. ⇒నిర్మాణం: 2004లో ప్రారంభమై 2005లో పూర్తి ⇒విస్తీర్ణం : 2 ఎకరాలు, నిర్మాణ వ్యయం : దాదాపు రూ.2 కోట్లు ⇒నివాసం: తొలుత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2005 నుంచి 2009 వరకు వినియోగించారు. ⇒తర్వాత రోశయ్య కేవలం క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకున్నారు. ⇒కిరణ్ కుమార్‌రెడ్డి 2010 నుంచి 2014 వరకు వాడారు. ⇒కేసీఆర్ 2014 నుంచి వినియోగిస్తున్నారు. వాస్తులోపం పేరుతో క్యాంపు కార్యాలయాన్ని వాడట్లేదు. -
ఇష్టారాజ్యంగా ఇసుక తోడుతారా!
కడప కార్పొరేషన్: జిల్లాలో ఇష్టం వచ్చినట్లుగా ఇసుక క్వారీలకు అనుమతులిచ్చి నీటి ఎద్దడి ఏర్పడేలా చేయవద్దని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం నియోజకవర్గంలో చెరువుకిందపల్లె, ఓబులంపల్లె, అనిమెల ఇసుక రీచ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల ఆయా ప్రాంతాలలో ఉన్న తాగునీటి స్కీంలు ఎండిపోయి నీటిఎద్దడి ఏర్పడే అవకాశముంద ని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పగా, రాయచోటి నియోజకవర్గంలో రోళ్లమడుగు వద్ద ఇసుకక్వారీని రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చెన్నూరు సమీపంలోని ఓబులంపల్లె వద్ద ఏర్పాటు చే స్తున్న ఇసుక క్వారీ వల్ల కడప నగరప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని కడప ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాషా ఫిర్యాదు చేశారు. ఆ రీచ్‌ను రద్దు చేయకపోతే నగర పాలకవర్గమంతా అక్కడే కూర్చొంటామని అధికారులను హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఇసుక రీచ్‌లకు అనుమతిచ్చేటప్పుడు అధికారులు వాస్తవ పరిస్థితులను అధ్యయం చేసి ఎక్కువ మందికి మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి కొందరికి ఆదాయం చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేయవద్దని సూచించారు. ఇష్టానుసారంగా ఇసుకక్వారీలకు అనుమతిస్తే తాగేందుకు నీరుండదని హెచ్చరించారు. భూగర్భ జల శాఖ అధికారుల నుంచి క్వారీలకు అనుకూలంగా నివేదిక వస్తేనే అనుమతి ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో తాను ప్రయివేటు సంస్థలచే సర్వే చేయించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అంతవరకూ తేవద్దని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ శ్రీనువాసులుకు సున్నింతంగా హెచ్చరిక చేశారు. సోమశిల బ్యాక్ వాటర్ స్కీం కింద తెచ్చిన పైపులు ఒట్టిపోతున్నాయని, కడప, ప్రొద్దుటూరు, ట్రిపుల్ ఐటీలకు నీరిందించే ఈ పథకం ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ నిధులు రూ. 5 కోట్లు తాగునీటి పనులకే ఖర్చు చేస్తున్నా ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ వల్ల మేలు జరిగే పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదని అసంత్పప్తి వ్యక్తం చేశారు. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇందుకు అన్ని చోట్లా చేస్తున్నామని ఎస్ఈ సమాధానమివ్వగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఎక్కడ చేశారో స్పష్టంగా చెప్పాలని, అవాస్తవాలు చెప్పవద్దని నిలదీశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఇసుక, ఎర్రచందనం, నీటిని అమ్ముకొంటూ వ్యాపారం చేస్తోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనంతరం ఎస్ఈ స్పందిస్తూ తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరగా, రూ.1.90 కోట్లు మంజూరు చేసిందని సమాధానమిచ్చారు. మరో రెండు కోట్లు విడుదల చేయిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. రూ.3900 కోట్లతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు 24 గంటలు తాగునీరు సరఫరా చేసేలా వాటర్ గ్రిడ్‌లో ప్రతిపాదించామన్నారు. అంత బడ్జెట్ ప్రభుత్వం విడుదల చేస్తుందా అని జగన్ అధికారులను ప్రశ్నించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పంచాయితీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన కరెంటు చార్జీలను ప్రభుత్వమే చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భారమంతా స్థానిక సంస్థలపై వేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపుకోవాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 890 కీ.మీల మేర 314 రోడ్లు నిర్మించడానికి రోడ్ గ్రిడ్ కింద రూ.193 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని పంచాయితీరాజ్ ఎస్ఈ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, డీసీసీబి ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
‘ఎర్ర’ దొంగల భరతం పడతాం
కడప కలెక్టరేట్(వైఎస్ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: జాతి సంపద అయిన ఎర్రచందనం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోకుండా స్మగ్లర్ల భరతం పట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశిధర్ తెలిపారు. బుధవారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా అటవీ రక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డీఎఫ్ఓలు నాగరాజు, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రాజు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సమావేశ వివరాాలను విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన దుర్ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం పోలీసుశాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ చెప్పారన్నారు. ప్రతి డీఎఫ్‌ఓకు 1+4 ఆర్మ్డ్ పోలీసులను కేటాయిస్తారన్నారు. వారు చెక్‌పోస్టులు, బేస్ క్యాంపుల వద్ద విధులు నిర్వర్తిస్తారన్నారు. పోలీసు, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని నిర్ణయించామన్నారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నమోదైన కేసుల్లో కేవలం ఒక శాతం మాత్రమే శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు. శిక్షల శాతాన్ని పెంచేందుకు అటవీశాఖ అధికారులను ఆదేశించామన్నారు. రెగ్యులర్ అటవీ చట్టాలను ప్రయోగించకుండా కేవలం పీడీ యాక్టు మాత్రమే ప్రయోగిస్తున్నారంటూ ఇటీవల సుప్రీం కోర్టు ప్రశ్నించిందని తెలిపారు. ఇకమీదట రెగ్యులర్ చట్టాలను ప్రయోగించి శిక్షల శాతాన్ని పెంచుతామన్నారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొనే అటవీ అధికారులను సైతం విడువబోమని స్పష్టం చేశారు. ఎర్రచందనం చెట్లు కొట్టివేసిన ప్రాంతాల్లో తిరిగి చెట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతామన్నారు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎర్రచందనం తరలించే గ్రామాలపై దాడులు, చెట్లను నరికే వాళ్లను పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అడవిలోకి వెళ్లే దారులపై దృష్టి సారిస్తామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఫారెస్టు కన్జర్వేటర్ (ప్రొబిషనరి) కృష్ణప్రియ, సబ్ డీఎస్ఓలు, వెంకటేశ్, శ్రీనివాసరావు, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి లవన్న, ఆర్డీఓ హరిత తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు బ్యాంకు రుణాలకు సన్నాహాలు
కడప సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, వారికి బ్యాంకుల ద్వారా రుణాలందిస్తామని డీఆర్వో ఈశ్వరయ్య తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమైక్యాంధ్ర ఉద్యమంపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు సమ్మెలో ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ బిల్లులు పాస్ కావడం లేదని తెలిపారు. చిరు ఉద్యోగులు సమ్మెతో కష్టాలు, నష్టాలకు గురికావలసి వస్తోందన్నారు. ఇలాంటి వారందరి కోసం బ్యాంకుల ద్వారా రుణాలందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా పలు బ్యాంకు అధికారులతో రుణాల విషయం చర్చించామన్నారు. సమావేశంలో ట్రెజరీ జిల్లా అధికారులు రంగప్ప, నాగరాజు, బాలసుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, ఎన్జీవో సంఘం నాయకులు కెవి శివారెడ్డి, శ్రీనివాసులు, జి. రవికుమార్, రామ్మూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
నారీ భేరి
సాక్షి, కడప : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జిల్లా ప్రజలు నిరసన గళం విప్పుతున్నారు. 46 రోజులుగా రెట్టించిన ఉత్సాహంతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, పోరుమామిళ్ల, బద్వేలు, రైల్వేకోడూరు తదితర ప్రాంతాలలో శనివారం మహిళా లోకం సమైక్య శంఖం పూరించింది. రాజంపేటలో రణభేరి సభద్వారా సమైక్య నినాదాన్ని మార్మోగించారు. జిల్లా వ్యాప్తంగా 600 గ్రామాల్లో ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కడప నగరం శంకరాపురంలోని 220 కేవీ లైన్లో సాంకేతిక లోపం తలెత్తింది. మరమ్మత్తులు చేసేందుకు వచ్చిన సిబ్బందిని విద్యుత్ కార్మికులు అడ్డుకున్నారు. అయితే ప్రజల ఇబ్బందులు, ఆస్పత్రులలో రోగుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని మానవతాదృక్పథంలో సరఫరాను పునరుద్ధరించేందుకు సహకరించారు. కడప నగరంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు మహిళా ఉద్యోగులు ర్యాలీతో కదం తొక్కారు. కోటిరెడ్డి సర్కిల్, ఏడురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి కార్డులను పంపారు. ప్రొద్దుటూరులో మహిళా ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. తహశీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ వెంకట్రావు సంఘీభావం తెలిపారు. బద్వేలులో 12, 13 వార్డులకు చెందిన యువకులు అగ్ని విన్యాసాలతో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టి రోడ్డుపై రింగ్ బాల్ ఆడారు. మెడికల్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఖాళీ బిందెలతో మానవహారాన్ని నిర్మించి నిరసన తెలియజేశారు. పులివెందుల పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. నలంద పాఠశాల విద్యార్థులు సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. వేంపల్లెలో ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. రాయచోటి పట్టణంలో న్యాయవాదులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. 71 మంది ఆర్టీసీ కార్మికులకు కడపకు చెందిన న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. చిన్నమండెంకు చెందిన సమైక్యవాదులు మాండవ్య నదిలో జలదీక్షను చేపట్టారు. రైల్వేకోడూరులో మహిళా ఉపాధ్యాయులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపి ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. రాకేష్ (35) అనే సమైక్యవాది గుండెపోటుతో మృతి చెందాడు. రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరి కార్యక్రమం సమైక్య నినాదాలతో మార్మోగింది. చిట్వేలి మైలపల్లె ఫీడర్లో లైన్మెన్గా పనిచేస్తున్న వెంకట్రావు రణభేరి సభలో సమైక్య నినాదాలు చేస్తూ కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సభకు ఎమ్మెల్యే ఆకేపాటి, మాజీ మంత్రి బ్రహ్మయ్య, మేడా మల్లికార్జునరెడ్డి హాజరయ్యారు. వంగపండు ఉష ఆటపాటలతో ఆకట్టుకున్నారు. మైదుకూరులో విశ్వబ్రాహ్మణులు, కార్పెంటర్లు యాగం చేసి మానవహారంగా ఏర్పడ్డారు. రుద్రకాళి, కాళీమాత రూపంలో వేషాలు వేసి విన్యాసాలు చేశారు. జమ్మలమడుగులో వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. -
అవనిగడ్డ ఉప ఎన్నికకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈ నెల 21న జరగనున్న అవనిగడ్డ ఉప ఎన్నికలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్.హెచ్.అనీల్ పంత్ అధికారులను ఆదేశించారు. స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం ఆయన రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మద్యం షాపులు మూసివేయటంతో పాటు, నిఘా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి మాట్లాడుతూ అవనిగడ్డ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోటీచేసే అభ్యర్థులు నియమావళిని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పోలింగ్ నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలలో వెబ్ క్యాస్టింగ్, మైక్రో పరిశీలన, వీడియో చిత్రీకరణ ఏర్పాట్లు చేశామన్నారు. మచిలీపట్నం, అవనిగడ్డలలో రెండు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మచిలీపట్నం ఆర్డీఓ సాయిబాబా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 91 గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికలను పురస్కరించుకుని 236 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ప్రదీప్‌రావు, శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.