సాక్షి, చెన్నై: చెన్నైలో కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్ని వర్షపు నీరుతో పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం అన్నా సలైలో ఓ వైపు భారీ వర్షం, మరోవైపు వందలాది వాహనాలతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్‌లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ పరిస్థితి విషయంగా ఉంది.
ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయిన అంబులెన్స్‌ను గమనించిన జిన్నా అనే ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తన బైక్‌ను పక్కన పెట్టేసి.. వర్షంలో సుమారు 4 కిలోమీటర్లు నడుస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారిచూపాడు. అతని సాయంతో అంబులెన్స్ సరైన సమయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది.
మానవత్వంతో ఆయన చేసిన పనికి అంబులెన్స్ డ్రైవర్.. జిన్నాతో సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టుదలతో 4 కిలో మీటర్లు నడిచి అంబులెన్స్ దారి చూపడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment