కర్ణాటక: సివిల్స్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ కావాలి, సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలి అనుకున్న ఒక యువతి కల ఫలించలేదు. బ్యాంకు ఉద్యోగంతో తృప్తి పడలేక, ఐఏఎస్ కాలేక మనోవ్యథతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండ్య నగరంలో చోటు చేసుకుంది. కావేరి గ్రామీణ బ్యాంక్ ప్రాదేశిక కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న శృతి (30) స్వస్థలం చామరాజనగర జిల్లా కొళ్లేగాల.
తండ్రి మల్లప్ప వ్యవసాయం చేసేవాడు. ముందు నుంచి ఆమె చదువులో చురుగ్గా ఉండేది. ఎలాగైనా ఐఏఎస్‌కు ఎంపిక కావాలని అనుకుంది. కానీ జీవితంలో ఉన్న ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదు. తరువాత ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ చూపి ప్రస్తుత ఉద్యోగం సంపాదించింది. మండ్య నగరంలోని వినాయక లేఔట్‌లోని అద్దె ఇంటిలో ఆదివారం రాత్రి డెత్‌నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని సమాచారం. మండ్య గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment