న్యూఢిల్లీ: రూ. కోటి మేర వంచనకు పాల్పడిన కే సుకు సంబంధించి ఆంధ్రా బ్యాంక్ మాజీ మేనేజర్‌తోపాటు మరొకరికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంప్రకాశ్ పాండే తీర్పు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి బ్యాంకు సొమ్మును వక్ర మార్గం పట్టించిన బ్యాంక్ మేనేజర్‌గావిధులు నిర్వర్తించిన 61 ఏళ్ల కృష్ణమూర్తితోపాటు ఓ ప్రైవేటు సంస్థ యజమాని అయిన ఇందర్‌కపూర్ లను దోషులుగా న్యాయమూర్తి ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ. 20 వేల చొప్పున న్యాయమూర్తి జరిమానా కూడా విధించారు. ఇదే కేసులో దోషులైన పాపిందర్‌సింగ్ హండా ఒక సంవత్సరం, సంగీత్‌కుమార్‌కు మూడు సంవత్సరాల చొప్పున కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
మరో నిందితుడు రత్నాకర్ నామా, జితేంద్ర గుప్తాలను మాత్రం సంశ య లబ్ధి కింద విడిచిపెట్టారు.మరో నిందితుడు దిల్జీత్ కపూర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. కాగా నకిలీ పత్రాలను సమర్పించిన దోషులు బ్యాంకునుంచి రూ. కోట మేర రుణం పొందారు. ఇందుకు బ్యాంక్ మేనేజర్ సహకరించాడు. అభియోగాలకు సంబంధించి తగిన ఆధారాలు ఉండడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు.