
మల్లవ్వతో మాట్లాడుతున్న తహసీల్దార్
బ్యాంక్ మేనేజర్‌పై ఫిర్యాదు
ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ తమపై దురుసుగా ప్రవర్తిస్తూ కర్రతో కొట్టాడని పింఛన్‌దారులు అల్లె లక్ష్మి, ఎండీ. నస్రీం, శాగ దేవవ్వ, ఒడ్డె మల్లవ్వ తెలిపారు. సోమవారం పింఛన్ దారులు, ఖాతాదా రులు పెద్ద సంఖ్యలో బ్యాంక్ వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో క్యూలైన్‌లో ఉన్న తమను మేనేజర్ కర్రతో కొట్టాడని విలపిం చారు. అక్కడే ఉన్న ఖాతాదారులు, మహి ళలు మేనేజర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నాయకులకు సమాచారం అందించారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు తిరుపతి, రాములు, రాజేశం, మహేష్‌రెడ్డి, రాం గోపాల్ బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారులతో కలసి బైఠా రుుంచారు. గంటకు పైగా బ్యాంకు ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీసులు వారిని సముదారుుంచారు. తాను ఎవరిపై దాడి చేయలేదని, దురుసుగా ప్రవర్తించలేదని బ్యాంక్ మేనేజర్ రాజేంద్రకుమార్ అన్నారు. బ్యాంకు మేనేజర్‌పై ఎస్సై ప్రవీణ్‌కు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రేణుక బ్యాంక్ వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. ధాన్యం డబ్బుల కోసం బ్యాంక్‌కు వచ్చిన తనను మేనేజర్ కర్రతో నడుముపై కొట్టాడని, నొప్పితో నడవ రావడం లేదని దేవవ్వ తెలిపింది.