బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని 14 వేలు దోచుకున్న దుండగుడు.
బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని మీ ఏటీఎం బ్లాక్ అయింది. దాన్ని పునరుద్ధరించాలంటే పిన్ నెంబర్ చెప్పండి అని పిన్ తెలుసుకున్న ఓ అగంతకుడు యువతి అకౌంట్‌లో నుంచి రూ. 14 వేల నగదును కాజేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కాంతం రేవతికి ఫోన్ చేసి అజ్ఞాత వ్యక్తి మీ ఏటీఎమ్ బ్లాక్ అయిందని దాన్ని పునరుద్ధరించడానికని పిన్ నెంబర్ తెలుసుకొని అకౌంట్‌లోని రూ. 14 వేల నగదును కాజేశాడు. విషయం గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.