డ్వాక్రా రుణాలూ కట్టాల్సిందే | debt waiver scheme State officers paid | Sakshi
Sakshi News home page

డ్వాక్రా రుణాలూ కట్టాల్సిందే

Published Wed, Jun 18 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

డ్వాక్రా రుణాలూ కట్టాల్సిందే

డ్వాక్రా రుణాలూ కట్టాల్సిందే

 నల్లజర్ల రూరల్ : ‘రుణమాఫీ హామీతో మాకు సంబంధం లేదు. మీరు తీసుకున్న రుణాలు ఇప్పటికే మొండి బకాయిల జాబితాలో చేరాయ్. ఈనెల 25లోగా బకాయిలు కట్టకపోతే మీ పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును బ కాయిలకు జమ చేసుకుంటాం’ డ్వా క్రా సంఘాల ప్రతినిధులనుఉద్దేశించి నల్లజర్లలోని స్టేట్‌బ్యాంక్ అధికారులు చేసిన హెచ్చరిక ఇది. మంగళవారం బ్యాంకు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండలంలోని 14 గ్రామాలకు చెందిన సంఘాల అధ్యక్షులు, కమ్యూనిటీ యూక్టివిస్ట్‌లు, ఐకేపీ ఏపీఎం జి.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సి.సురేంద్రబాబు మాట్లాడుతూ తమ బ్యాంకు పరిధిలో దాదాపు 350 గ్రూపులకు చెందిన మహిళలు గడచిన ఆరు నెలల్లో రూ.5 కోట్ల వరకు బకాయిలు చెల్లించలేదని చెప్పారు.
 
 రుణాలను తక్షణమే వసూలు చేయూలంటూ ఉన్నతాధికారుల నుంచి వత్తిళ్లు వస్తున్నాయన్నారు. మూడు వారుుదాలు చెల్లించని రుణాలన్నీ మొండి బకాయిల జాబితాలోకి వెళతాయని తెలిపారు. డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని వివరించారు. వెంటనే డ్వాక్రా రుణాలను చెల్లించాలని కోరారు. దీనిపై మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ వర్తింపచేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి కమిటీ నియామకం కూడా జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఏ విషయం తేలేవరకూ వసూళ్లను నిలిపివేయూలని కోరారు. బ్యాంక్ మేనేజర్ సురేంద్రబాబు స్పందిస్తూ.. తాము చేయగలిగిందేమీ లేదని, ఈనెల 25లోగా బకాయిలు చెల్లించకపోతే డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో ఉన్న సొమ్మును బకారుులకు జమ చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అలా చేస్తే తామంతా ధర్నాలకు దిగుతామని మహిళా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement