Debt waiver scheme
-
తుదిదశకు రుణ మాఫీ!
- రెండు రోజుల్లో కొలిక్కి రానున్న జాబితా - కసరత్తు ముమ్మరంచేసిన యంత్రాంగం - జిల్లావ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణమాఫీ ప్రక్రియ తుదిదశకు చేరింది. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసేందుకు యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వాస్తవానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాల్సి ఉన్నా బ్యాంకర్లు, అధికారుల మధ్య నెలకొన్న సమన్వయలోపం కారణంగా జాప్యం జరిగింది. గత నెల 29వతేదీ నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో ఉమ్మడిస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి.. 30వ తేదీన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ జాబితాను విడుదల చేయాలి. కానీ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. తాజాగా ఈ జాబితా విడుదలకు సంబంధించి యంత్రాంగం చర్యలను వేగిరం చేసింది. కేటగిరీల వారీగా లబ్ధిదారులను ఏరివేస్తూ తుది జాబితా కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తంగా ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేయనున్నారు. దశల వారీగా ‘ఏరివేత’ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం.. ఒక కుటుంబానికి సంబంధించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఒక్కో రైతు రెండు, మూడు బ్యాంకుల్లో తీసుకున్న రుణ వివరాలను సేకరిస్తూ.. వాటన్నింటినీ క్రోడీకరించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాఫీ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ముందుగా బ్యాంకుల వారీగా లబ్ధిదారుల వివరాలను మ్యాచ్ చేస్తూ.. మండల స్థాయిలోని అన్ని బ్యాంకుల్లో వివరాలను సరిపోల్చిన అనంతరం జిల్లాస్థాయిలో ఈ వివరాలను క్రోడీకరించి తుది జాబితా తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా నాలుగు దశల్లో చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్హులు రెండు లక్షలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం కింద జిల్లాలో రెండు లక్షల మంది లబ్ధిపొందనున్నట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించి ఆరువందల శాఖలున్నాయి. వీటిలో కేవలం 258 శాఖలు మాత్రమే రైతులకు రుణాలు మంజూరు చేశాయి. ఇందులో పంట రుణాల కేటగిరీలో 2.03 లక్షల మందికి రూ.986.59కోట్లు, బంగారు ఆభరణాల రుణ కేటగిరీలో 13వేల మందికి రూ.82.95కోట్లు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే వీరిలో రెండేసి ఖాతాలు ఎంత మందికి ఉన్నాయి.. వాటి పరిమితి ఎంత అనే అంశంపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 24 మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, ఒకట్రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తుది జాబితా విడుదల అవుతుందని ఓ అధికారి ‘సాక్షి’కి వివరించారు. -
ఆర్బీఐ అనుమతిలేకుండా మాఫీ ప్రకటనా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్బీఐ అనుమతి లేకుండా రుణ మాఫీ పథకాన్ని ఎలా ప్రవేశపెడతారని, రాజకీయ పార్టీల అనాలోచిత నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందంటూ కెనరా బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రుణ మాఫీ పథకంపై స్పష్టత లేకపోవడంతో కట్టే స్తోమత ఉన్న వారు కూడా రుణాలు చెల్లించడం లేదని, దీంతో పెరుగుతున్న ఎన్పీఏలు బ్యాంకింగ్ రంగాన్ని గడ్డు పరిస్థితుల్లోకి నెడుతున్నాయంటూ వాపోయారు. మంగళవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చన దుబే కలిసిన విలేకరులతో మాట్లాడుతూ రుణ మాఫీ పథకంపై ఆర్బీఐతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా ఒక స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బకాయిలు వసూలు కాకపోవడంతో దీని ప్రభావం కొత్త రుణాల మంజూరుపై ప్రభావం చూపుతుందని, తద్వారా రైతులు దెబ్బతింటారన్నారు. కొత్త రుణాల మంజూరుపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ, ఎన్‌పీఎల ఒత్తిడి వల్ల బ్యాంకు మేనేజర్లు కొత్త రుణాల మంజూరుపై ఆసక్తి చూపలేరని ఒక ప్రశ్నకు సమాధానంగా దుబే తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాపార విస్తరణపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని, రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా మరో 150 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కెనరా బ్యాంకుకు 350 శాఖలున్నాయి. రూ. 3,000 కోట్ల క్విప్ ఇష్యూ వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల సేకరణకు త్వరలోనే క్విప్ ఇష్యూ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఇష్యూకి ఆర్బీఐ నుంచి అనుమతి లభించిందని తృతీయ త్రైమాసికంలో ఇష్యూకు వచ్చే ఆలోచన ఉందన్నారు. దీంతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు(ఎఫ్‌పీవో) వస్తామని, కాని దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఏడాదిలో ఎఫ్‌పీవోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రుణాల రీకవరీ బాగుండటంతో ఈ ఏడాది చివరికి ఎన్పీఏలు తగ్గే అవకాశం ఉందన్నారు. మార్చి, 2014 నాటికి కెనరా బ్యాంక్ స్థూల ఎన్పీఏ 2.94%, నికర ఎన్పీఏలు 1.98%గా ఉన్నాయి. ఓటీఎస్‌కి ఒకే అంటే కేసులు వెనక్కి తీసుకుంటాం... డీసీకి కెనరా బ్యాంక్ ఆఫర్ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్ఎల్) వన్ టైమ్ సెటిలిమెంట్ (ఓటీఎస్)కి ముందుకు వస్తే, ఆ సంస్థపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని కెనరా బ్యాంక్ ప్రకటించింది. చెల్లించలేకపోతున్న రుణాలను పునర్ వ్యవస్థీకరించాలంటూ డీసీహెచ్ఎల్ ప్రమోటర్లు తమను కలిసి కోరారని, కాని మేము సీబీఐ వద్ద మోసం కేసు నమోదు చేయడంతో ఇది సాధ్యం కాదని, అవసరమైతే ఓటీఎస్‌కి అవకాశం ఇస్తామని చెప్పినట్లు దుబే తెలిపారు. ఓటీఎస్ కింద నిర్ణయించి మొత్తాన్ని చెల్లించడానికి వస్తే కేసులు ఉపసంహరించుకుంటామని, ఇంతవరకు డీసీ ప్రమోటర్లు ముందుకు రాలేదన్నారు. ఓటీఎస్‌కి రాకపోతే ఈ ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించే ఆలోచనలో ఉన్నామని, సీబీఐ కేసు ఉండటంతో దీనికి ఆర్బీఐ నుంచి అనుమతి లభించాల్సి ఉందన్నారు. కెనరా బ్యాంక్‌కి డీసీహెచ్ఎల్ రూ.350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. తప్పుడు తనఖా పత్రాలను పెట్టి రుణం తీసుకుంది అంటూ కెనరా బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇది విచారణలో ఉందని దుబే తెలిపారు. రెండో ఆర్థిక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో రెండవ ఆర్థిక రాజధానిగా ఎదగడానికి హైదరాబాద్‌కి అన్ని అర్హతలు ఉన్నాయని, ఇందుకు కావల్సిన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. దేశ జీడీపీలో 25 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుండటం, ఐఆర్డీఏ ప్రధాన కార్యాలయం, ఆర్థిక జిల్లాతో పాటు అనేక ఆర్థిక సంస్థలు ఉండటంతో ముంబై తర్వాత ఆర్థిక రాజధానిగా హైదరాబాద్‌కు అన్ని హంగులు ఉన్నాయన్నారు. గ్రామీణ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసే విధంగా క్షేత్రస్థాయి నుంచి బడ్జెట్ అంచనాలు తీసుకుంటున్నామని, కేవలం ప్రకటనలే కాకుండా నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహిస్తున్న ‘ఫిన్సెక్-2014’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. గ్రామీణ ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయడానికి అవసరమైతే బ్యాంకులు, బీమా, సూక్ష్మ రుణ సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రూ. లక్ష లోపు వ్యయసాయ రుణాల మాఫీకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -
డ్వాక్రా రుణాలూ కట్టాల్సిందే
నల్లజర్ల రూరల్ : ‘రుణమాఫీ హామీతో మాకు సంబంధం లేదు. మీరు తీసుకున్న రుణాలు ఇప్పటికే మొండి బకాయిల జాబితాలో చేరాయ్. ఈనెల 25లోగా బకాయిలు కట్టకపోతే మీ పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును బ కాయిలకు జమ చేసుకుంటాం’ డ్వా క్రా సంఘాల ప్రతినిధులనుఉద్దేశించి నల్లజర్లలోని స్టేట్‌బ్యాంక్ అధికారులు చేసిన హెచ్చరిక ఇది. మంగళవారం బ్యాంకు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండలంలోని 14 గ్రామాలకు చెందిన సంఘాల అధ్యక్షులు, కమ్యూనిటీ యూక్టివిస్ట్లు, ఐకేపీ ఏపీఎం జి.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సి.సురేంద్రబాబు మాట్లాడుతూ తమ బ్యాంకు పరిధిలో దాదాపు 350 గ్రూపులకు చెందిన మహిళలు గడచిన ఆరు నెలల్లో రూ.5 కోట్ల వరకు బకాయిలు చెల్లించలేదని చెప్పారు. రుణాలను తక్షణమే వసూలు చేయూలంటూ ఉన్నతాధికారుల నుంచి వత్తిళ్లు వస్తున్నాయన్నారు. మూడు వారుుదాలు చెల్లించని రుణాలన్నీ మొండి బకాయిల జాబితాలోకి వెళతాయని తెలిపారు. డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని వివరించారు. వెంటనే డ్వాక్రా రుణాలను చెల్లించాలని కోరారు. దీనిపై మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ వర్తింపచేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి కమిటీ నియామకం కూడా జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఏ విషయం తేలేవరకూ వసూళ్లను నిలిపివేయూలని కోరారు. బ్యాంక్ మేనేజర్ సురేంద్రబాబు స్పందిస్తూ.. తాము చేయగలిగిందేమీ లేదని, ఈనెల 25లోగా బకాయిలు చెల్లించకపోతే డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో ఉన్న సొమ్మును బకారుులకు జమ చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అలా చేస్తే తామంతా ధర్నాలకు దిగుతామని మహిళా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. -
పీఏసీఎస్‌లకు రుణ మాఫీ సెగ
ఏడాదిగా నిలిచిపోయిన రికవరీ ఇదే సాకుగా సంఘ ఉద్యోగుల జీతాల నిలిపివేత రుణమాఫీ పూర్తిగా అమలుకాకుంటే కష్టమే ఆందోళన వ్యక్తం చేస్తున్న సహకార ఉద్యోగులు నర్సీపట్నం, న్యూస్‌లైన్ : రుణమాఫీ పథకం సెగ పీఏసీఎస్‌లకు తాకింది. ఎన్నికల నేపథ్యంలో ఏడాది క్రితమే ప్రకటించిన రుణమాఫీ పథకం ప్రకటనతో వసూళ్లు నిలిచిపోయాయి. దీంతో సొసైటీ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ రుణమాఫీ సాధ్యం కాకపోతే సంఘాలన్నీ చితికిపోయే ప్రమాదముంది. వ్యవసాయం చేసే రైతులకు ప్రధానంగా రుణాలిచ్చి ఆదుకునేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే(పీఏసీఎస్). జిల్లాలోని 98 పీఏసీఎస్‌ల్లో 1.45 లక్షల రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరికి 2013-14 వ్యవసాయ సీజన్‌కుగాను రూ. 240 కోట్లు రుణంగా అందించారు. అదనంగా దీర్ఘకాలిక రుణాలుగా రూ. 40 కోట్లు పంపిణీ చేశారు. గత సీజన్లో పీఏసీఎస్‌ల్లోనే రైతులకు రూ.280 కోట్ల రుణం అందింది. రికవరీ అనంతరం కొత్త రుణాలు ఇవ్వడం ఏటా జరిగే పర్వం. కానీ ఈ ఏడాదే పరిస్థితి డైలామాలో ఉంది. నిలిచిన రికవరీ ఏడాది క్రితమే సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభం కావడం, తొలినుంచీ తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీని భుజానికి ఎత్తుకోవడంతో జిల్లాలోని 98 పీఏసీఎస్‌ల పరిధిలో రుణ బకాయిల వసూళ్లు నిలిచిపోయాయి. రికవరీని సాకుగా చూపి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పీఏసీఎస్ ఉద్యోగుల జీతభత్యాలు నిలిపివేసింది. ఐదు నెలలుగా దాదాపు రూ.2 కోట్లు నిలిచిపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. సంపూర్ణ మాఫీ కాకుంటే ప్రమాదమే సంపూర్ణ రుణ మాఫీ ప్రకటనతో రైతులంతా బకాయిల చెల్లింపులు నిలిపివేశారు. ఈ దశలో ఒక పరిధి విధించి రుణ మాఫీ చేస్తే, మిగిలిన రైతులు బకాయిలు చెల్లించే పరిస్థితి ఉండదు. ఈ పరిణామం సహకార సంఘాలన్నీ చితికిపోయేందుకు దారితీస్తుందని జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పినపాత్రుని నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖలు కలిసి రుణాల పంపిణీలో భాద్యత వహిస్తున్నా, బకాయిల వసూళ్ల విషయంలో మాత్రం సహకార సంఘాల ఉద్యోగులనే భాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు సహకార వ్యవస్థ పతనానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
రుణమాఫీ.. అయితేనే హ్యాపీ
‘దాళ్వా గట్టెక్కిందన్న మాటే గానీ.. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు ఖర్చులకు సరిపోరుంది. చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు. తొలకరి సీజన్ వచ్చేస్తోంది. వారం పది రోజుల్లో పొలం దున్నాలి. నారు పోయూలి. మొన్నటివరకూ చేసిన అప్పులు ఇంకా తీరలేదు. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కనిపించట్లేదు. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే నమ్మి ఓటేశాం. బ్యాంకోళ్ల దగ్గరకు పోతే మాఫీ సంగతి తమకేమీ తెలియదంటున్నారు. కొత్త అప్పు ఇమ్మంటే.. పాత అప్పు కడితే గాని ఇచ్చేది లేదంటున్నారు. తొలకరి పంట ఎలా వేయూలో అర్థం కావట్లేదు...’ ఏ రైతును కదిపినా ఇదే మాట వినిపిస్తోంది. వ్యవసాయ రుణాల మాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న అన్నదాతలు ఆ తీపి కబురు ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. - అప్పుల ఊబిలో అన్నదాతలు విముక్తి కోసం ఎదురుచూపులు - వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు - నేటికీ విడుదల కాని మార్గదర్శకాలు - ఈ నెలాఖరుతో ముగుస్తున్న చెల్లింపుల గడువు సాక్షి, నాలుగేళ్లపాటు ప్రకృతి వైపరీ త్యాలతో పంటలు కోల్పోయిన రైతులు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో దాదాపు 14,55,030 ఖాతాల ద్వారా రూ.11 వేల 848 కోట్లను వ్యవసాయ రుణాలుగా తీసుకున్న అన్నదాతలు అవి మాఫీ అయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోపు రుణమొత్తాలను తిరిగి చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. లేదంటే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకూ రుణమాఫీకి సంబంధించి తమకు ఎలాం టి మార్గదర్శకాలు అందలేదంటున్నారు. మరోవైపు సార్వా సీజన్ ముంచుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో రుణమాఫీ అవుతుందా.. లేదా.. కొత్త రుణాలు వస్తాయా.. రావా? అనే అనుమానాలు, ఆందోళనలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. వేటికి వర్తిస్తుందో మరి జిల్లాలో ఏటా దాదాపు 2 లక్షల మంది రైతులు 36 బ్యాంకుల నుంచి వ్యక్తిగతంగా ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.80 వేల చొప్పున వ్యవసాయ రుణం పొందుతుంటారు. ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభంలో పంట రుణాలు, వ్యవసా య ఖర్చుల కోసం ఏడాది పొడవునా బంగారం హామీపై రుణాలు, వ్యవసాయ భూమిపై స్వల్పకాలిక రుణాలు ఇస్తుంటారు. వ్యవసాయ పరికరాలు, యంత్రాల కొనుగోలుకు తీసుకునే రుణాన్ని టెర్మ్లోన్గా పిలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ దాదాపు రూ.12వేల కోట్ల మేర రైతులు రుణాలు తీసుకున్నారు. వీటిలో వేటికి రుణమాఫీ వర్తిస్తుందనేది ప్రస్తుతానికి సమాధానం దొరకడం లేదు. గడువు ముగిసిపోతే... వ్యవసాయ రుణాలను తిరిగి చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ మాత్రమే గడువు ఉంది. గడువు దాటితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ రాయితీలు రైతులకు అందవు. ప్రస్తుతం 9 శాతం వడ్డీకి బ్యాంకులు వ్యవసాయ రుణాలిస్తున్నాయి. ఇందులో 2 శాతం సాధారణంగా, 3 శాతం సక్రమ చెల్లింపుదారులకు మొత్తంగా 5 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. సక్రమ చెల్లింపుదారుల తరపున మిగిలిన 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీంతో వడ్డీ లేని రుణం రైతుకు లభించినట్టవుతోంది. కానీ గడువు ముగిసిపోతే కేంద్రం ఇచ్చే 2 శాతం మినహా మిగిలిన 7శాతం వడ్డీని రైతులే భరించాలి. కొంతకాలం గడువు తర్వాత 10.50 శాతం వడ్డీ పడుతుంది. దీంతో రైతులు భయపడుతున్నారు. రుణమాఫీపై నమ్మకంతో రైతులు తీసుకున్న మొత్తాన్ని చెల్లించకపోతే వడ్డీల భారం మోయాలి. అలాగని బాకీ చెల్లించిన తరువాత రుణాలను మాఫీచేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ పరిస్థితుల్లో రుణాలు కట్టాలో, లేదో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. మార్గదర్శకాలు రాలేదు వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. వాస్తవానికి రైతులు ఈ నెలాఖ రులోపు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. మాఫీ అవుతాయనే ఆశతో ఎవరూ బకాయిలు చెల్లించడం లేదు. నిబంధనల ప్రకారం బ్యాంకులు తమపని చేసుకుపోతాయి. కొత్త రుణాల మంజూరుపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో తీసుకున్న రుణం చెల్లించిన వారికే కొత్తగా రుణం లభించే అవకాశం ఉంది. - ఎం.లక్ష్మీనారాయణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వేయి క ళ్లతో ఎదురు చూస్తున్నాం సార్వాలో వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆచంట మృత్యుంజయ సహకార బ్యాంకులో పొలం తనఖా పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకున్నాను. దాళ్వాలో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. అప్పులు మిగిలాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రుణమాఫీ కోసం వేయి క ళ్లతో ఎదరు చూస్తున్నాం. - తమ్మినీడి సూర్యనారాయణ, ఆచంట తక్షణమే రుణమాఫీ చేయూలి నగలు తనఖా పెట్టి వ్యవసాయ పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు తీసుకున్నాను. ఈ మధ్యన కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయాను. ఐదు ఎకరాల మీద దాదాపు రూ.30 వేల నష్టం వచ్చింది. ఏం చేయాలో పాలుపోవడంలేదు. రుణమాఫీ చేస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదు. తక్షణమే రుణమాఫీ చేయూలి. -పూసల నాగ్వేరరావు, ఆచంట