ఖాతాదారుల సొమ్ము మింగిన బ్యాంక్ మేనేజర్!
ఏలూరు: తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు తణుకు బ్రాంచ్ మేనేజర్ ఖాతాదారుల సొమ్ము మింగేశాడు. ఆ బ్రాంచ్ మేనేజర్ వినోద్ రాజన్ కోటి 35 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. 22 మంది ఖాతాదారుల సంతకాలు ఫోర్జరీ చేసి వినోద్ ఈ డబ్బు నొక్కేసినట్లు వెల్లడైంది.
ఉన్నతాధికారుల తనిఖీలో వినోద్ రాజన్ బండారం బయటపడింది. బ్యాంకు అధికారులు వినోద్ రాజన్ను సస్పెండ్ చేసి తణుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.