సాక్షి, హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలి నుంచీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మూడో వ్యక్తి ఆర్‌ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డిని సైతం సోమవారం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఆదివారం విచారణలో భాగంగా శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయిల స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. దీనిలో భాగంగానే కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు సాయితో పాటు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కీలక ఆధారాలు లభ్యమైయ్యే వరకు ముగ్గురు అనుమానితులూ తమ అదుపులోని ఉంటారని పోలీసులు తెలిపారు. (దేవరాజ్‌తో వివాహం చేయండి : శ్రావణి)
అయితే కేసు విచారణలో భాగంగానే శ్రావణి కుటుంబ సభ్యులు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. తమ కుమార్తె మరణానికి దేవరాజే కారణమని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. అయితే దేవరాజ్ మాత్రం సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాలు, ఆడియో రికార్డులను పోలీసులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. అయితే ఆదివారం నాటి విచారణతో కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది. (శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment