రిటైర్డ్ ఏసీపీపై లైంగిక వేధింపుల కేసు నమోదు | sexual harassment case against retired acp | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ ఏసీపీపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Published Fri, Jun 27 2014 9:46 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

sexual harassment case against retired acp

హైదరాబాద్: బల్కంపేట డివిజన్ బాపూనగర్‌కు చెందిన పోలీసు రిటైర్ ఏసీపీపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అత్తిలి లక్ష్మి బాపూనగర్‌లోని పోలీసు విభాగంలో పని చేసి రిటైర్ ఏసీపీ గులాబ్‌సింగ్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని హాస్టల్ నడుపుతుంది.

కిరాయి కోసం వచ్చిన ప్రతిసారీ గులాబ్‌సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.   రోజులు గడుస్తున్నా నిందితుడిపై చర్యలు తీసుకోవటం లేదని బాధితురాలు శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి విలేకరులకు తెలిపింది.తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement