Retired ACP
-
ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే అన్ని బెనిఫిట్స్ తీసుకెళ్లొచ్చంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే కొందరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఇన్చార్జుల నిర్లక్ష్యం కారణంగా అది నెరవేరట్లేదు. ఫలితంగా పదవీ విరమణ చేసిన అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే రిటైర్డ్ ఏసీపీ కేఎన్ విజయ్‌కుమార్ పరిస్థితి. సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేసిన కేఎన్ విజయ్‌కుమార్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఇప్పటికీ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ దక్క లేదు. ఇటీవల ఆయన కరోనా బారినపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొదట కొద్ది రోజులు గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందారు. ఆర్థిక కారణాలతో ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రస్తుతం మరో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. ఎంతో సేవ చేసిన తన తండ్రిని పోలీస్ విభాగం గాలికి వదిలేసిందంటూ ఆయన కుమార్తె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, విజయ్‌కుమార్‌ను ఫోన్లో ‘సాక్షి’పలకరించింది. ‘నాకు రావాల్సిన బెనిఫిట్స్ నేను దాచుకున్నవి. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా కష్టార్జితం నుంచి పొదుపు చేసుకున్న నగదు ఇప్పుడు చేతికి అందట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఇందల్వాయి ఎస్ఐ శివప్రసారెడ్డిపై వేటు మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..! -
రిటైర్డ్ ఏసీపీపై లైంగిక వేధింపుల కేసు నమోదు
హైదరాబాద్: బల్కంపేట డివిజన్ బాపూనగర్‌కు చెందిన పోలీసు రిటైర్ ఏసీపీపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అత్తిలి లక్ష్మి బాపూనగర్‌లోని పోలీసు విభాగంలో పని చేసి రిటైర్ ఏసీపీ గులాబ్‌సింగ్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని హాస్టల్ నడుపుతుంది. కిరాయి కోసం వచ్చిన ప్రతిసారీ గులాబ్‌సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రోజులు గడుస్తున్నా నిందితుడిపై చర్యలు తీసుకోవటం లేదని బాధితురాలు శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి విలేకరులకు తెలిపింది.తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. -
రిటైర్డ్ ఏసీపీపై అత్యాచార ఆరోపణలపై స్పందించిన హెచ్ఆర్సీ!
హైదరాబాద్: రిటైర్డ్ ఏసీపీ గులాబ్సింగ్పై మానవ హక్కుల కమిషన్ లో శుక్రవారం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారని బాధితురాలు లక్ష్మి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మహిళ అందించిన ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టి జూలై 28లోగా నివేదిక సమర్పించాలని పంజాగుట్ట ఏసీపీని మావన హక్కుల కమిషన్ కోరింది. పంజాగుట్ట పోలీసులు అందించే నివేదిక ఆధారంగా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాధితురాలికి హెచ్ఆర్ సీ తెలిపింది.