రిటైర్డ్ ఏసీపీపై అత్యాచార ఆరోపణలపై స్పందించిన హెచ్ఆర్సీ!
Published Fri, Jun 27 2014 8:10 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
హైదరాబాద్: రిటైర్డ్ ఏసీపీ గులాబ్‌సింగ్‌పై మానవ హక్కుల కమిషన్ లో శుక్రవారం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారని బాధితురాలు లక్ష్మి హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. మహిళ అందించిన ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో విచారణ చేపట్టి జూలై 28లోగా నివేదిక సమర్పించాలని పంజాగుట్ట ఏసీపీని మావన హక్కుల కమిషన్ కోరింది. పంజాగుట్ట పోలీసులు అందించే నివేదిక ఆధారంగా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాధితురాలికి హెచ్ఆర్ సీ తెలిపింది.
Advertisement
Advertisement