వృద్ధురాలి ఇంట్లో చోరీ చేసింది అల్లుడే! | ornaments stolen case: sun-in-law arrested | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఇంట్లో చోరీ చేసింది అల్లుడే!

Jan 15 2018 7:47 PM | Updated on Oct 4 2018 8:29 PM

సాక్షి, ఎస్సార్‌నగర్‌(హైదరాబాద్‌): తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే కాబోలు. అత్తింటికే ఓ అల్లుడు కన్నం వేశాడు. పాపం పండి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. గత నెల 31వ తేదీన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీ నగర్‌లో ఆంటోనమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. ఆమెను గాయపరిచి ఇంట్లో కారం చల్లి 20 తులాల బంగారు ఆభరణాలు, నగదును దుండగులు చోరీ చేశారు. ఈ కేసును పోలీసులు పదిహేను రోజుల్లోనే ఛేదించారు. ఆమె అల్లుడే చోరీ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. దీంతో హ్యాపీ అనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement