
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా మహేష్‌పూర్‌లో బస్సుకు కరెంటు వైర్ తగిలి మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే బస్సు దగ్ధమయ్యింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సజీవదహనం అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. జోధ్‌పూర్ ఆస్పత్రిలో మరో 17 మందికి చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment