లక్నో: ఉత్తర ప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ము తావి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని, దాదాపు వందమందికి పైగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల నుపర్యవేక్షిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.