సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సుమారు 350మందితో ప్రయాణిస్తున్న రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 72 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే అందోళన వ్యక్తమవుతోంది. అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సరిగ్గా పార్క్ చేయని ట్రక్ ఒకటి రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. తైటంగ్‌కు ప్రయాణిస్తున్న ఈ రైలు హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగంలో పట్టాలు తప్పింది. సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. సొరంగం మధ్య ఇరుక్కు పోవడం రక్షణ చర్యలు కష్టంగా ఉన్నాయని పేర్కొన్నాయి.
ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి
Published Fri, Apr 2 2021 10:13 AM | Last Updated on Fri, Apr 2 2021 1:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment