పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్
బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లి సమీపంలో పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్తో పాటు మరో బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ప్రమాదం జరగలేదని, ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని నైరుతి రైల్వే జీఎం పీ కే సక్సేనా తెలిపారు.
ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.